Paytmతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేస్తున్నారా? అయితే ఒకసారి చూడండి...

|

ఇండియాలో ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్ చేయడం అధికమవుతున్నది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పేమెంట్స్ యాప్ లలో Paytm కూడా ఒకటి. ఇప్పుడు ఎవరైనా వినియోగదారులు Paytm ప్లాట్‌ఫారమ్ నుండి ఏదైనా ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు వారి వద్ద నుండి రుసుమును వసూలు చేస్తోంది. రుసుమును వసూలు చేయడంతో ప్లాన్ యొక్క మొత్తం ఖర్చు కూడా పెరుగుతుంది. ఇందులో మరొక విషయం ఏమిటంటే రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్రీపెయిడ్ ప్లాన్‌ల మీద మాత్రమే కన్వీనియన్స్ ఫీజును వసూలు చెయబడుతుంది .

Paytm

ఇంకా UPI మరియు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి ఆన్‌లైన్ పద్ధతుల ద్వారా వినియోగదారులు చెల్లించే రీఛార్జ్‌ల మీద కూడా కన్వీనియన్స్ ఫీని వసూలు చేస్తుండడం అనేది ఆకర్షనీయమైన అంశం. కొన్ని నివేదికల ప్రకారం మార్చి 2022 నుంచి ఎంపిక చేసిన Paytm వినియోగదారులకు కన్వీనియన్స్ ఫీజు రావడం ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్ ఎక్కువ మంది వినియోగదారుల నుండి ఈ ఫీని వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వినియోగదారులు ఇకపై భరించాల్సిన అదనపు ఖర్చుల గురించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Microsoft Internet explorer రిటైర్ అవుతుంది ! ఇక మీకు అందుబాటులో ఉండదు.Microsoft Internet explorer రిటైర్ అవుతుంది ! ఇక మీకు అందుబాటులో ఉండదు.

మొబైల్ రీఛార్జ్‌లపై కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్న Paytm

మొబైల్ రీఛార్జ్‌లపై కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్న Paytm

Paytm తన ప్లాట్‌ఫారమ్ ద్వారా మొబైల్ రీఛార్జ్‌లను చేసే వినియోగదారుల వద్ద నుండి సుమారు రూ.1 నుండి రూ.6 వరకు వసూలు చేస్తుంది. వినియోగదారు ఏ రీఛార్జ్ ప్లాన్‌కు వెళ్లాలనుకుంటున్నారనే దానిపై కన్వీనియన్స్ ఫీజు మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇది చాలా పెద్ద మొత్తం కాదు కానీ ఖచ్చితంగా వినియోగదారులను ఇబ్బంది పెట్టే విషయం. ఎందుకంటే ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో మొబైల్ రీఛార్జ్‌లపై ఎటువంటి అదనపు మొత్తం రుసుము రూపంలో వసూలు చేయదు.

మొబైల్ రీఛార్జ్‌

నెలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి చేసే మొబైల్ రీఛార్జ్‌ల కోసం వినియోగదారులు Paytmని ఉపయోగించి చేసే ప్రతి రీఛార్జ్‌కు కన్వీనియన్స్ ఫీజును చెల్లించడానికి బదులు టెలికాం సంస్థలు అందించే మొబైల్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల నుండి నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇండియాలో ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఇప్పటికే అధికంగా ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం మరింత పెరగవచ్చని కూడా భావిస్తున్నారు. అందువల్ల వినియోగదారులు మొబైల్ సేవలను వినియోగించడం కోసం రీఛార్జ్ చేసుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. కావున రీఛార్జ్ చేసుకునేటప్పుడు అదనపు మొత్తాన్ని చెల్లించడానికి ఎవరు కూడా ఇష్టపడరు.

మొబైల్ రీఛార్జ్‌

మొబైల్ రీఛార్జ్‌లపై కన్వీనియన్స్ ఫీజును వసూలు చేయడం అనేది Paytmకి మరింత ఆదాయాన్ని ఆర్జించడానికి దారిని చూపుతున్నది. అయినప్పటికీ ఈ నిర్ణయం కంపెనీని దెబ్బ తీయడానికి దారితీయవచ్చు. Paytm లిస్టింగ్ అయినప్పటి నుండి స్టాక్ మార్కెట్‌లో కష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే మార్కెట్ క్యాప్‌లో వేల కోట్లను కోల్పోయింది. కంపెనీ పనితీరును మెరుగుపరచుకుని స్థిరమైన స్థానానికి చేరుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Best Mobiles in India

English summary
Paytm Will Charge Convenience Fee on Mobile Prepaid Plans Recharge

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X