Home
News

యాప్ ద్వారా పర్సనల్ లోన్ పొందండం ఎలా ?

ఇప్పటి దాకా పర్సనల్ లోన్ కోసం అందరూ కాళ్లు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

By Hazarath Aiah

ఇప్పటి దాకా పర్సనల్ లోన్ కోసం అందరూ కాళ్లు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇకపై అలాంటి కష్టాలు లేకుండా కేవలం ఆన్‌లైన్ ద్వారానే మీకు పర్సనల్ లోన్ ఇచ్చే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు ఇలాంటి ఆఫర్ ఇస్తుండగా తాజాగా ఇప్పుడు PayU, Reliance Money కూడా చేరాయి. ఇవి రెండు ఉమ్మడి భాగస్వామ్యంలో అవసరమైన వారికి లోన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వ్యాపారఅవకాశాలను మరింతగా విస్తరించుకోవాలనే నేపథ్యంలో రిలయన్స్ మనీ ఈ రకమైన ఆఫర్లకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. మరి లోన్ పొందే మార్గాలు, అర్హతలను ఓ సారి పరిశీలిస్తే..

ఉద్యోగులకు

ఉద్యోగులకు

నెల జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇటువంటి లోన్లు అందిస్తారు.

 LazyPay ద్వారా

LazyPay ద్వారా

ఎవరైనా లోన్ కోసం ప్రయత్నిస్తుంటే LazyPay ద్వారా పొందవచ్చు. మొబైల్ లో ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని అందులో ఉన్న సూచనలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

రిలయన్స్ మనీ

రిలయన్స్ మనీ

లోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించగలరా లేదా అన్న విషయాన్ని రిలయన్స్ మనీ తనకున్న స్టాఫ్, టెక్నాలజీ ద్వారా తెలుసుకుని రిపోర్ట్ ఇస్తుంది. ఆ తర్వాతే మీకు లోన్ లభిస్తుంది.

రూ. 100 నుంచి దాదాపు లక్ష వరకు

రూ. 100 నుంచి దాదాపు లక్ష వరకు

ఈ లోన్ మీరు రూ. 100 నుంచి దాదాపు లక్ష వరకు పొందే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని 15 రోజుల నుంచి 24 నెలల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ప్రధాన నగరాల్లో

ప్రధాన నగరాల్లో

ప్రస్తుతానికి Ahmedabad, Jaipur, Hyderabad, Bangalore, Chandigarh, Lucknowలాంటి ప్రధాన నగరాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

110 నగరాలకు

110 నగరాలకు

ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 110 నగరాలకు విస్తరించాలన్నదే కంపెనీ ప్రణాళికగా తెలుస్తోంది. ఇప్పటికే దీని ద్వారా మొత్తం 39 నగరాల్లో 51400 మంది కస్టమర్లు రూ. 13,474 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు.

దేశంలో 15 కోట్ల మంది

దేశంలో 15 కోట్ల మంది

కాగా లోన్ తీసుకుని తిరిగి కట్టగలిగే వారు దేశంలో 15 కోట్ల మంది ఉన్నారని అంచనా, వీరంతా నెల జీతంతో బతికే వారు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు. వీరంతా ఈ లోన్ల వైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
PayU, Reliance Money partner to offer instant app-based personal loans more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X