పెగాసస్ స్పైవేర్ నుండి మీ ఫోన్‌ను రక్షించే ఈ టిప్స్ మీద ఓ లుక్ వేయండి!!

|

పెగసాస్ స్పైవేర్ గత కొన్ని రోజులుగా వందలాది ప్రముఖ వ్యక్తుల మొబైల్ ఫోన్‌లను ప్రభావితం చేస్తున్నది. స్పైవేర్ మొట్టమొదట 2016 సంవత్సరంలో కనుగొనబడింది. తరువాత 2019 లో మానవ హక్కుల కార్యకలాపాల వినియోగదారుల యొక్క ఫోన్‌లకు సోకినట్లు చాలా నివేదికలు తెలిపాయి. పెగసాస్ ఒక అధునాతన స్పైవేర్ అని చెప్పబడింది. ఇది చాలా ఖరీదైనది మరియు సామాన్యుడు భరించలేని విధముగా ఉన్నది.

పెగసాస్ స్పైవేర్

పెగసాస్ స్పైవేర్ ప్రధానంగా తెలిసిన ప్రముఖ వ్యక్తుల ఫోన్‌లపై రహస్యంగా దాడి చేయడానికి ఉపయోగిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి మీ ఫోన్ ప్రమాదకరమైన పెగసాస్ స్పైవేర్‌తో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా మీ మొబైల్ పరికరానికి సోకే అనేక ఇతర స్పైవేర్‌లు అందుబాటులో ఉన్నాయి కావున జాగ్రత్తపడడం మంచిది. ఈ రోజుల్లో పెరుగుతున్న స్పైవేర్ దాడుల సంఖ్యను పరిశీలిస్తే మీ మొబైల్ ఫోన్‌ను పెగసాస్ వంటి ప్రమాదకరమైన స్పైవేర్ నుండి రక్షించడానికి మేము 5 చిట్కాలను జాబితా చేసాము. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యాంటీవైరస్ సొల్యూషన్ ను ఉపయోగించడం

యాంటీవైరస్ సొల్యూషన్ ను ఉపయోగించడం

మొబైల్ ఫోన్లలో అనేక యాంటీవైరస్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్లు గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఆపిల్ యాప్ స్టోర్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ యాంటీవైరస్ పరిష్కారాలు మీ మొబైల్ ఫోన్‌లో ప్రమాదకరమైన స్పైవేర్‌ను ఇన్‌స్టాల్ చేయకుండా హ్యాకర్లు మరియు స్కామర్లను నిరోధిస్తాయి. యాంటీవైరస్ సొల్యూషన్ మొబైల్ ఫోన్‌ను ప్రభావితం కాకుండా పూర్తిగా రక్షించదని గమనించాలి. కాబట్టి వినియోగదారులు అనుమానాస్పద లింకులు, కాల్‌లు మరియు సందేశాలతో జాగ్రత్తగా ఉండాలి.

పాస్‌వర్డ్‌లను తరచుగా మార్చడం
 

పాస్‌వర్డ్‌లను తరచుగా మార్చడం

సెక్యూరిటీ పరిశోధకులు క్లౌడ్ సర్వీసులపై పాస్‌వర్డ్‌లను మరియు తరచూ ఉపయోగించే యాప్లను రోజూ మార్చమని సలహా ఇస్తారు. ఇలా కాకున్నా ప్రధానంగా 30 మరియు 45 రోజుల వ్యవధిలో అయినా మార్చడం ఉత్తమం. ఈ విధానాన్ని అమలుచేయకపోతే కనుక మీ మొబైల్ పరికరంపై హ్యాకర్లు లేదా స్కామర్లు దాడి చేయడం సులభం చేస్తుంది.

బలమైన పాస్‌వర్డ్‌ను సెటప్ చేయడం

బలమైన పాస్‌వర్డ్‌ను సెటప్ చేయడం

మీ ఫోన్ మరియు వ్యక్తిగత డేటాను హ్యాకర్ల నుండి సురక్షితంగా ఉంచడానికి బలమైన పాస్‌వర్డ్‌ను సెటప్ చేయడం తప్పనిసరి. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ లేదా మరే ఇతర వ్యక్తిగత వివరాలను పాస్‌వర్డ్‌గా ఉపయోగించవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లలో వర్ణమాలలు, చిహ్నాలు, నెంబర్ల వంటి మిశ్రమాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఇలా చేయడంతో మీ యొక్క పాస్‌వర్డ్‌ను ఎవరూ కూడా ఉహించలేరు.

సురక్షిత హార్డ్‌వేర్‌తో ఫోన్‌ను ఉపయోగించడం

సురక్షిత హార్డ్‌వేర్‌తో ఫోన్‌ను ఉపయోగించడం

సురక్షితమైన హార్డ్‌వేర్‌తో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలని పరిశోధకులు వినియోగదారులను సూచిస్తున్నారు. ఆపిల్, శామ్‌సంగ్ వంటి బ్రాండ్ల నుండి కొన్ని ప్రీమియం ఫోన్‌లు సురక్షితమైన హార్డ్‌వేర్‌ను అందిస్తాయి. ఇవి పెగసాస్ వంటి స్పైవేర్‌లను మొబైల్ పరికరాన్ని ప్రభావితం చేయకుండా నిరోధించగలవు.

యాదృచ్ఛిక యాప్ లను ఇన్‌స్టాల్ చేయవద్దు

యాదృచ్ఛిక యాప్ లను ఇన్‌స్టాల్ చేయవద్దు

వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లో యాదృచ్ఛిక, అనవసరమైన యాప్ లను డౌన్‌లోడ్ చేయవద్దని భద్రతా పరిశోధకులు సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుండి యాప్ లను ఇంస్టాల్ చేసే ధోరణిని కలిగి ఉంటారు. ఇది తరచుగా మాల్వేర్ కావచ్చు లేదా వారి డేటా మరియు డబ్బును దొంగిలించడానికి మోసగించడానికి హ్యాకర్లు ఉపయోగించే మార్గం. కాబట్టి డెవలపర్ చేత సురక్షితమైన మరియు అభివృద్ధి చేయబడిన నమ్మకమైన / ధృవీకరించబడిన యాప్ లను మాత్రమే డౌన్‌లోడ్ చేయండి.

Best Mobiles in India

English summary
Pegasus Spyware: How to Protect Your Phone From These Dangerous Software

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X