ఈ OTP స్కామ్‌తో జాగ్రత్త?

ఆన్‌లైన్ బ్యాకింగ్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా వెలుగుచూసిన నయా స్కామ్‌లో భాగంగా వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను సైతం హ్యాకర్లు కొల్లగొట్టేస్తున్నారు.

|

ఆన్‌లైన్ బ్యాకింగ్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా వెలుగుచూసిన నయా స్కామ్‌లో భాగంగా వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను సైతం హ్యాకర్లు కొల్లగొట్టేస్తున్నారు. టు-ఫాక్టర్ అథంటికేషన్‌ను కలిగి ఉండే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను అంత సులువుగా హ్యాక్ చేయటం కుదరదు. అలాంటిది, వీటిని కూడా హ్యాకర్లు రాబట్టేస్తున్నారు. ముఖ్యంగా ఈ తరహా స్కామ్‌కు బెంగుళూరు వాసులు ఎక్కువగా బలైపోతున్నారు. ఈ ప్రమాదకర ఓటీపీ స్కామ్ గురించి పలు ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఫ్లిప్‌కార్ట్ లో బడ్జెట్ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్లు...అస్సలు మిస్ అవ్వకండిఫ్లిప్‌కార్ట్ లో బడ్జెట్ ఫోన్ల పై అదిరిపోయే డిస్కౌంట్లు...అస్సలు మిస్ అవ్వకండి

వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను

వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను

ఈ వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు చాలా స్మార్ట్‌గా దొంగిలించేస్తున్నారు. బాధితుల ఫోన్‌లలో మాల్వేర్‌లను ఇన్‌స్టాల్ చేయటం లేదా బ్యాంక్ ఉద్యోగులుగా పరిచయం చేసుకుని వారి వద్ద నుంచి ఓటీపీలను కొల్లగొట్టేస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఎలా జరుగుతుందంటే?

ముందుగా బాధితుడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి

ముందుగా బాధితుడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి

ముందుగా బాధితుడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను బ్యాంక్ ఉద్యోగినని నమ్మబలికే ప్రయత్నం చేస్తాడు. ఆ తరువాత బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నామంటూ చెబుతారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీలను అడుగుతారు. ఇవి తెలుసుకున్న తరువాత ఆయా కార్డులతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓ ఎస్ఎంఎస్‌ను పంపుతున్నామని, ఆ ఎస్ఎంఎస్‌లో కన్ఫర్మేషన్ లింక్ ఒకటి ఉంటుందని, ఆ లింక్ పై క్లిక్ చేసినవెంటనే అప్ గ్రేడ్ ప్రాసెస్ పూర్తవుతుందని వారు చెబుతారు.

యూజర్ ఫోన్ లో తనకు తెలియకుండానే మాల్వేర్‌ ఇన్‌స్టాల్ అయి పోతుంది
 

యూజర్ ఫోన్ లో తనకు తెలియకుండానే మాల్వేర్‌ ఇన్‌స్టాల్ అయి పోతుంది

వారి మాటలను నమ్మి ఎస్ఎంఎస్‌ను ఓపెన్ లోపలి కన్ఫర్మేషన్ ముసుగులో ఉన్న మాల్వేర్ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే యూజర్ ఫోన్ లో తనకు తెలియకుండానే మాల్వేర్‌ ఇన్‌స్టాల్ అయి పోతుంది. ఆ తరువాత నుంచి యూజర్ ఫోన్‌కు వచ్చే ప్రతి మెసేజ్ కూడా హ్యాకర్‌కు రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధమైన వ్యూహాలను అనుసరించి అమాయకుల బ్యాంక్ ఖాతాల నుంచి యూజర్లు డబ్బు దొంగిలించేస్తున్నారు.

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు. కాబట్టి ఇటువంటి ఫేక్ కాల్స్‌కు స్పందించవద్దని, ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే తమకు సమాచారమివ్వాలని వారు కోరుతున్నారు.

Best Mobiles in India

English summary
People are losing lakhs to this dangerous OTP online banking scam.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X