Number Neighbours, ఈ గేమ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది
ఇంటర్నెట్ అనేది అనేక వింతలు విశేషాలకు నిలయం. ఈ మధ్య వైరల్ ట్రెండ్స్ అలాగే కొత్త ఛాలెంజ్ లు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. కొత్త కొత్తగా ఛాలెంజ్ లను ఇంటర్నెట్లో పెడుతూ అందరికీ సవాల్ విసురుతున్నారు యూజర్లు. ఈ కోవలోనే మరో ఛాలెంజ్ వచ్చి చేరింది. number neighbours పేరిట ఇప్పుడు ట్విట్టర్లో ఓ కొత్త గేమ్ మొదలైంది.మీరెప్పుడైనా మీ ఫోన్ నంబర్‌కు ఒక అంకె ముందు లేదా వెనుక నంబర్ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా..?ఇప్పుడు ఇదే ట్రెండ్ సోషల్ మీడియాలో నడుస్తోంది.

నెంబర్‌కు ముందు వెనక ఎవరు ?
బైమిస్టేక్‌గా ఒక నెంబర్ మారి కాల్ చేయడం చాలామంది చేస్తుంటాం. కానీ మన నెంబర్‌కు ముందు, లేదా వెనకాల నెంబర్ ఎవరిదో అన్న ఉత్సాహం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తుంటారు. ఇలా కొందరు ఇప్పటికే చేసి ఉండొచ్చు.. మరికొందరు ప్రయత్నం చేద్దామని అనుకుని ఎందుకులే అని వదిలేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడీ కొత్త ట్రెండ్ నెటిజన్లను ఓ ఊపు ఊపేస్తోంది.ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో 'నంబర్ నైబర్' అనే ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. 'నైబర్ నంబర్' పేరుతో ట్రెండ్ అవుతున్న ఈ చాలెంజ్‌లో భాగంగా మన ఫోన్ నంబరుకు ముందు, లేదంటే వెనకున్న నంబరు ఎవరిదో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా.. వారి నంబరుకు మెసేజ్ చేయడం ద్వారా తెలుసుకోవడమే.తమ ఫోన్ నంబర్‌లోని చివరి అంకెని ఒకటి అటూ లేదా ఇటు మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడమే 'నంబర్ నైబర్' అన్నమాట. నెటిజన్లు ప్రస్తుతం ఈ కొత్త సవాల్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నెటిజన్లు తమ నైబర్ నంబర్లకు మెసేజ్ చేసి వారి నుంచి వచ్చిన రిప్లైలను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.

ఈ గేమ్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ నంబర్ కు ముందు వెనక ఉన్న నంబర్లతో ఛాట్ చేయండి. వాట్సప్, సాధారణ ఎసెమ్మెస్ ఇంకా ఇతర మర్గాల్లో వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారి నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టవచ్చు. అయితే ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. అవతలి వాళ్లు ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలిసి ఉంటుంది.


Click it and Unblock the Notifications








