ఉచిత వై-ఫైతో బూతు వెబ్‌సైట్‌లు చూస్తున్నారు?

రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన ఉచిత వై-ఫై సర్వీసులను ఉపయోగించుకోవటం బీహార్ రాజధాని మొదటి స్థానంలో నిలిచినట్లు ఓ పరిశీలనలో తేలింది.

ఉచిత వై-ఫైతో బూతు వెబ్‌సైట్‌లు చూస్తున్నారు?

Read More : చైనాకు ధీటుగా అమెరికా, రూ.12,999కే భారీ ఫీచర్ల ఫోన్

పాట్నా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వై-ఫై సర్వీస్ ద్వారా అత్యధికంగా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తునట్లు రైల్వే అధికారులు విశ్లేషణలో భాగంగా వెల్లడైంది. ఈ రైల్వే స్టేషన్‌లో లభ్యమవుతోన్న ఉచిత వై-ఫై ద్వారా ఎక్కువ మంది పోర్న్ సైట్‌లను సెర్చ్ చేసి సంబంధిత కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాప్స్‌, సినిమాలు..

పాట్నా స్టేషన్‌లో ఉచితంగా లభిస్తోన్న వై-ఫై ద్వారా యాప్స్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను కూడా ఈ ఫ్రీ వై-ఫై ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు తేలింది.

పాట్నా తరువాత జైపూర్

ఉచిత వై-ఫై ఇంటర్నెట్‌ను ఎక్కువుగా ఉపయోగించుకుంటోన్న రైల్వే స్టేషన్‌ల జాబితాలో పాట్నా తరువాత స్థానాల్లో జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ స్టేషన్లు ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దానాపూర్ డివిజన్ పరిధిలోకి..

తూర్పు రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్ పరిధిలోకి పాట్నా రైల్వేస్టేషన్ ఉచిత వై-ఫై పొందిన మొదటి రైల్వేస్టేషన్. రోజు ఈ స్టేషన్ మీదగా 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైల్‌టెల్ సంస్థ..

ప్రస్తుతం రైల్‌టెల్ సంస్థ పాట్నా రైల్వేస్టేషన్‌లో ఒక గిగాబైట్ వై-ఫై డేటాను అందిస్తోంది. అధిక డిమాండ్ దృష్ట్యా ఈ వేగాన్ని 10 గిగాబైట్లకు పెంచాలని రైల్‌టెల్ సంస్థ భావిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్నెట్ స్పీడు తగ్గుతోంది..

ఉచిత ఇంటర్నెట్ కోసం యువత, ఎక్కువ మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు రావడం వలన అక్కడ ఇంటర్నెట్ స్పీడు తగ్గిపోతోందని అధికారులు చెప్పారు.

23 ప్రముఖ రైల్వే స్టేషన్‌లలో ..

బీహార్‌లోని పాట్నా, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, జార్ఖండ్‌లోని రాంచీతో సహ దేశంలోని 23 ప్రముఖ రైల్వే స్టేషన్‌లలో ఉచిత వై-ఫైను లాంచ్ చేసారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రానున్న మూడేళ్ల కాలంలో..

రానున్న మూడేళ్ల కాలంలో 400 వరకు ప్రముఖ స్లేషన్ లకు ఉచిత వై-ఫై సేవలను విస్తరింపజేస్తామని రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు ఇటీవల వెల్లడించారు. రైల్ టెల్ సంస్థ గూగుల్ సౌజన్యంతో వై-ఫై సేవలను అందిస్తోన్న విషయం తెలసిందే.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
People Watching Obscene Sites on Free wifi at Patna Railway Station, Says Official. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot