Home
News

దారుణం, కొండి పైకి తీసుకెళ్లి?

సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని ఇప్పటికే అనేక సంఘటనలు రుజువు చేసాయి. సోషల్ మీడియాలో నిత్య కొత్తదనం కోసం పరితపిస్తున్న యువత ప్రస్తుతం ‘సెల్ఫీ' లోకంలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. ఒక్కోసారి ఈ సెల్ఫీ వ్యామోహం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది. సెల్ఫీలు చిత్రీకరించుకున్న కొద్ది క్షణాల్లోనే ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయిన పలువురి వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

మే 2015,

తన ‘అల్టిమేట్ సెల్ఫీ'తో ఫేస్‌బుక్‌లో సంచలనంగా నిలవాలని ఓ యువతి చేసిన సాహసం ఆమె ప్రాణాలనే కబళించేసింది. వివరాల్లోకి వెళితే ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో అన్నా ఉర్సూ (18) అనే టీనేజర్ ఓ స్పెషల్ సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలనుకుంది. ఈ క్రమంలో తమ మిత్రురాలితో దగ్గరలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఏదైనా కొత్త చేయాలని భావించిన ఆ యువతి అనుకున్నదే తడవుగా రైలు పైకి ఎక్కి సెల్ఫీ చిత్రీకరించుకోవాలని ప్రయత్నించింది.ఈ క్రమంలో ఆమె కాలు 27,000 వోల్ట్‌ల సామర్థ్యం గల మైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో ఒక్కాసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 50శాతం కాలిన శరీరంతో తీవ్రగాయాల పాలైన అన్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

 

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

2014లో పోలాండ్‌కు చెందిన ఓ టూరిస్ట్ సెల్ఫీ తీసుకునే క్రమంలో దక్షిణ స్పెయిన్‌లోని ఐకానిక్ బ్రిడ్జ్ అయిన Puente de Triana నుంచి క్రిందపడి మరణించాడు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

ఫేస్‌బుక్‌లో తన స్నేహితులను ఆకట్టుకునేందుకు తాగిన మత్తులో ఆస్కార్ ఒటిరో అనే యువ రెటర్నరీ వైద్యుడు బల్లెట్ లోడ్ చేసిఉన్న తుపాకీని తల దగ్గరగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆస్కార్ తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. దీంతో అక్కడికక్కెడే మరణించాడు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

రెగ్గాటన్ సంగీతకారుడు జాడియిల్ మోటారు సైకిల్ ప్రమాదంలో మరణించే ముందు తీసుకున్న సెల్ఫీ ఇది

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

‘సెల్ఫీ' తీసుకోవాలని ఓ కొండపైకి ఎక్కిన దంపతులు అక్కడ్నుంచి ప్రమాదవశాత్తు జారీ పడటంతో తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన పోర్చుగల్‌లో జరిగింది. లిస్బన్ సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలమైన కోబో డి రోకా కొండపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎవరూ లేనటువంటి కొండపైకి ఆ దంపతులు చేరుకున్నారు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

కరెన్ హెర్నాండెజ్ అనే మహిళ మెక్సికోలోని ఎల్ ట్యూనల్ నది సమీపంలో సెల్ఫీ తీసుకోవాలనే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించారు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఇరాన్ మహిళలు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ ఇద్దురు మహిళలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళుతూ సెల్ఫీని చిత్రకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

21 సంవత్సరాల జీన్ సెల్ఫీ తీసుకోవాలన్న తాపత్రయంతో రైలు పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ మరణించాడు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

తూర్పు యుక్రెయిన్ లో ప్రమాదానికి గురైన మాలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్17లో మరణించిన తల్లీకొడుకులు విమానం బయలుదేరేముందుకు తీసుకున్న సెల్ఫీ ఇది!

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

మెక్సికన్ పాప్‌స్టార్ జిన్నీ రివిరా తన బృందంతో కలిసి ఓ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించేందుకు తీసుకున్న సెల్ఫీ ఇది. ప్రమాదవశాత్తూ ఆ జెల్ కూలిపోవటంతో అందరూ మరణించారు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

కోలెట్ మోరెనో, ఆష్లీ థెయోబాల్డ్ అనే ఇద్దరు మహిళలు కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీ ఇది. ప్రమాదవశాత్తూ వీరు ప్రయాణిస్తున్న కారు వేరొక వాహానాన్ని ఢీకొనటంతో ఇద్దురూ ప్రాణాలను కోల్పోయారు.

 దారుణమైన  సెల్ఫీ ప్రమాదాలు

దారుణమైన సెల్ఫీ ప్రమాదాలు

కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ అనే మహిళ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకు కారు ప్రమాదంలో దుర్మరణంపాలైంది. యూఎస్ హైవే పై కారులో ప్రయాణిస్తున్న మహిళ కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకే ఎదురుగా వెళుతున్న రిసైకిలింగ్ ట్రక్‌ను ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Best Mobiles in India

English summary
People Who Died While Taking Selfies. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X