పెప్పర్ రోబోట్: ఫేస్ మాస్క్ వేసుకోలేదో అంతే సంగతులు!!!

|

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం పాకింది. దీని దెబ్బకు అన్ని దేశాలు మార్చి నుండి లాక్ డౌన్ ను ప్రకటించాయి. చాలా రోజులు లాక్ డౌన్ ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అది గమనించి లాక్ డౌన్ ను ఎత్తివేశారు. ప్రజలు ఇప్పుడు స్వాతంత్రంగా బయట తిరుగుతున్నారు. కానీ కోవిడ్ -19 నుండి రక్షణ కోసం పేస్ మాస్క్ లను వాడమని అందరు సూచిస్తున్నారు. ప్రజలు పేస్ మాస్క్ ధరించారో లేదో గుర్తించడానికి కొంత మంది ఇంజనీర్లు ఒక ప్రత్యేకమైన రోబోను తయారుచేసారు. ఇది ప్రజలను పేస్ మాస్క్ ధరించమని మర్యాదపూర్వకంగా గుర్తు చేస్తుఉంటుంది.

పెప్పర్ రోబోట్ స్పెసిఫికేషన్స్
 

పెప్పర్ రోబోట్ స్పెసిఫికేషన్స్

షాపింగ్ మాల్స్ ,సినిమా థియేటర్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో జనాలు ఎక్కువగా సంచరిస్తున్న ప్రదేశాలలో వారిని స్వాగతించడానికి మరియు సామాజిక దూరం పాటించడాన్ని గుర్తుచేసే పెప్పర్ అనే రోబోట్ 120 సెంటీమీటర్లు లేదా 47 అంగుళాల ఎత్తుతో తయారుచేసారు. ఇది మనిషి ప్రవర్తించే కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. కొన్ని దేశాలలో ఇప్పటికే దీనిని జనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో అమలులోకి తీసుకువచ్చారు.

Also Read: Samsung Galaxy S20 ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!

పెప్పర్ రోబోట్ కెమెరా స్కాన్ ఫీచర్స్

పెప్పర్ రోబోట్ కెమెరా స్కాన్ ఫీచర్స్

పెప్పర్ రోబోట్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో అమర్చిన కెమెరా సాయంతో దాని వద్దకు వచ్చే ప్రతి ఒక్కరి ముఖాలను స్కాన్ చేస్తుంది. మరి ముఖ్యంగా యూజర్ల యొక్క ముఖం దిగువ భాగంలో ప్రత్యేకించి స్కాన్ చేస్తుంది. ఎవరైనా ఫేస్ మాస్క్ ధరించి ఉండకపోతే వెంటనే వారిని హెచ్చరిస్తుంది. ఇది "మీరు ఎల్లప్పుడూ ముసుగును ధరించాలి" అనే ఈ పదబంధాన్ని ఉచ్చరిస్తుంది. అలాగే సందర్శకుడు ముసుగు వేసుకున్నట్లు ఉంటే కనుక "ముసుగు వేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు" అనే పదబంధాన్ని ఉచ్చరిస్తు రోబోట్ వారిని ఆహ్వానిస్తుంది.

రోబోట్ పోలీసుల కార్యాచరణ

రోబోట్ పోలీసుల కార్యాచరణ

పెప్పర్ రోబోట్ ను చాలా దేశాలలో ఇప్పటికే "దుకాణాల యొక్క ప్రవేశద్వారం వద్ద ప్రజలను ముసుగులు ధరించమని గౌరవంగా ఆహ్వానిస్తు స్వాగతం పలకడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో రోబోట్ పోలీసుల వలె కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రోబోట్ కోవిడ్ -19 సోకిన వ్యక్తుల నుంచి దూరంగా ఉండచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. తద్వారా మీరు మీ యొక్క సాధారణ పనులపై సులభంగా దృష్టి పెట్టవచ్చు."

Most Read Articles
Best Mobiles in India

English summary
Pepper Robot Given The Instruction to Wear The Mask For Protect Covid-19

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X