ఏ చెవులకు ఎటువంటి హెడ్ ఫోన్స్ సెట్ అవుతాయో తెలుసుకోవడం ఎలా?

Posted By: Super

ఏ చెవులకు ఎటువంటి హెడ్ ఫోన్స్ సెట్ అవుతాయో తెలుసుకోవడం ఎలా?

చేతిలో మొబైల్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉందన్నాడు ఓ పెద్దాయన. మనం ఎటువంటి మొబైల్ కొనాలని అనేదాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. సాధారణంగా మనం ఎప్పుడైనా ప్రయాణాలలో ఉన్న లేక, బోర్ కొట్టినప్పుడు మొబైల్‌లో పాటలు వినడానికి ప్రయత్నిస్తాం. అలా పాటలు వినాలంటే మనకు మొబైల్‌కు చక్కని హెడ్ ఫోన్స్ ఉంటే మ్యూజిక్ అనేది వినసొంపుగా ఉంటుంది. ఎటువంటి మొబైల్స్‌కు ఎటువంటి హెడ్ ఫోన్స్ ఐతే బాగుంటుంది అనే దానిగురించి చక్కటి విశ్లేషణలు మీకోసం....

హెడ్ ఫోన్స్ మనకు డిపరెంట్ స్టైల్స్‌లో మార్కెట్‌లో దోరుకుతుంటాయి. ఐతే మనకు అందులో మన మ్యూజిక్‌ని ఎంజాయ్ చెయ్యడానికి మన చెవులకు సరిపోయేటటువంటి స్టయిల్‌గా ఉంటేటుటవంటి హెడ్ ఫోన్స్ కోసం మనం చూస్తుంటాం. అందుకే మీకు కొన్ని రకాలైనటువంటి హెడ్ ఫోన్స్ ఫీచర్స్ మీముందు ఉంచుతున్నాను. వీటిల్లో మీకు ఏది నచ్చితే వాటిని కొనుక్కోని మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయండి.

* ఇయర్ ప్యాడ్ హెడ్ ఫోన్స్

ఐప్యాడ్ రాకముందు ఇయర్ ప్యాడ్ హెడ్ ఫోన్స్ బాగా వాడుకలో ఉన్నటువంటి హెడ్ ఫోన్స్. ఇప్పటికి కూడా మార్కెట్‌లో మంచి పేరు ఉన్నటువంటి హెడ్ ఫోన్స్ ఇయర్ ప్యాడ్ హెడ్ ఫోన్స్. ఇక ఈ హెడ్ ఫోన్స్ విషయానికి వస్తే చిన్న ప్యాడ్స్‌ని కలిగిఉండి చెవులకు అంటిపెట్టుకోని వినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఐతే ఇందులో ఓపెన్ మోడల్స్‌కి సంబంధించిన హెడ్ ఫోన్స్ దోరకడం కష్టం. ఐతే ఈ హెడ్ ఫోన్స్‌లో ఓ చిన్న చిక్కు వచ్చి పడింది. అదేమిటంటే హెడ్ ఫోన్స్ ఏదైనా చిన్న లీక్ ఉంటే మాత్రం బయటవైపు ఉన్నటువంటి నాయిస్ మనకు క్లియర్‌గా వినపడుతుంది.


మనం ఎప్పుడైనా బయటకు వెళ్శినప్పుడు లేదా పార్కులో ఉన్నప్పుడు ఈ హెడ్ ఫోన్స్ మాత్రం చాలా చక్కగా ఉంటాయి. ముఖ్యంగా ఈ హెడ్ ఫోన్స్ వల్ల ఉపయోగం ఏమిటంటే చెవులకు ఎటువంటి నోప్పి ఉండదు. తెరచి ఉన్నటువంటి దీని మోడల్ చక్కటి సౌండ్‌ వచ్చేలా ఉపయోగపడుతుంది. 80మైళ్శ వేగంతో మీ ప్రక్కన ముసలావిడ పోతున్నా కూడా మీరు ఆమె వైపు తలతిప్పుకోకుండా మ్యూజిక్ వింటూనే ఉంటారు మీ వద్ద ఈ హెడ్ ఫోన్స్ ఉంటే. ఇక వీటి ఖరీదు విషయానికి వస్తే కేవలం $79 మాత్రమే.

* ఇయర్ బర్డ్స్

ఇయర్ బర్డ్స్ అనేవి చాలా చిన్నవిగా ఉండి మన చెవులలోన పెట్టుకునే విధంగా ఉంటాయి. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకు కారణం ఐప్యాడ్‌ కొన్నప్పుడు మనకు ఇలాంటి ఇయర్ బర్డ్స్ మాత్రమే లభిస్తాయి. ఇయర్ బర్డ్స్ సాధారణంగా మన చెవులలోపల పెట్టుకనే వెసులుబాటు ఉంటుంది. చెవుల లోపల ఉన్నటువంటి ఇయర్ కెనాల్ వరకు కూడా ఇవి వెల్లడం జరుగుతుంది. దీని ద్వారా మ్యూజిక్ అనేది మన చెవులలోనికి వెల్లే అవకాశం ఉంటుంది.


ఇయర్ బర్డ్స్ అనేవి వాడడానికి చాలా ఈజీగా ఉంటాయి. వీటిని ఒకచోట నుండి ఇంకోక చోటుకి తీసుకోని వెల్లడం కూడా చాలా సులభం. బయట వైపు నుండి వచ్చేటటువంటి నాయిస్ నుండి కాపాడడానికి ఇయర్ బర్డ్స్‌లో స్పెషల్‌గా కొన్ని పరికరాలు అమర్చడం జరుగుతుంది. మీరు వాడేటటువంటి హెడ్ ఫోన్స్‌తో పోల్చినట్లేతే ఇయర్ బర్డ్స్ ఉత్తమం అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇయర్ బర్డ్స్‌ వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. హెడ్ పోన్స్ వల్ల మనం చక్కటి సంగీతాన్ని పోందగలుగుతాం. వీటి వల్ల కూడా అది సాధ్యమే కానీ కొన్ని కొన్ని సమయాలలో అంటే విమానాలు, పెద్ద పెద్ద బస్సుల ప్రక్కనుండి వెళుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇక ఇయర్ బర్డ్స్ ఖరీదు విషయానికి వస్తే $99 నుండి ప్రారంభం అవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot