ఈ యాప్స్‌ ఉంటే మీ వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉన్నట్లే

By Gizbot Bureau
|

ఈ రోజుల్లో వ్యక్తిగత సమాచారాన్ని దాచుకోవడం అనేది చాలా క్లిష్టతరమవుతోంది. ఎందుకంటే మన వ్యక్తిగత డేటా మనకు తెలియకుండానే అనేక సైట్లలో ప్రత్యక్షమవుతోంది. ఒక్కోసారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా ఈ యాప్స్ మన డేటాని లీక్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ డేటా చాలా ప్రమాదకరంగా మారింది. మహిళలు గర్భనిరోధకానికి వాడే సలహాలు, సూచనల సమాచారాన్ని ఈ పిరియడ్ ట్రాకంగ్ యాప్స్ వారి వ్యక్తిగత డేటాను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా MIA Fem and Maya లాంటి యాప్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ వివరాలను యుకెకు చెందిన advocacy group అయిన Privacy International బయటపెట్టింది.

 

సోషల్ మీడియాలో బహిర్గతం

సోషల్ మీడియాలో బహిర్గతం

ఈ యాప్స్ లో లాగిన్ అయిన మహిళల వ్యక్తిగత డేటా మొత్తాన్ని ఇవి సోషల్ మీడియాలో బహిర్గతం చేశాయని రిపోర్ట్ వెల్లడించింది. మిల్లియన్ యూజర్లు వీరి భారీన పడ్డారని dvocacy group అయిన Privacy International తెలిపింది. 

సున్నితమైన అంశాలను

సున్నితమైన అంశాలను

గర్భనిరోదకానికి సంబంధించిన కీలక సమాచారంను MIA Fem and Maya లాంటి యాప్స్ తస్కరించాయని రిపోర్ట్ తెలిపింది. మహిళలు గర్భం రాకుండా ఉండే పిరియడ్, అలాగే వాపు లక్షణాలు, తిమ్మిరిగా ఉండటం ఇంకా ఇతర సున్నితమైన అంశాలను నేరుగా ఫేస్ బుక్ తో షేర్ చేసుకుందని BuzzFeed News కూడా రిపోర్ట్ చేసింది.

గర్భం రాకుండా ఉండేందుకు
 

గర్భం రాకుండా ఉండేందుకు

MIA Fem and Maya యాప్స్ తో మహిళలు పంచుకున్న మొత్తం వివరాలు సోషల్ మీడియాలో బహిర్గతం అవడంతో అందరూ షాకయ్యారు. మహిళలు గర్భం రాకుండా ఉండేందుకు తీసుకునే సలహాలు సూచనలు అన్నీ ఛాటింగ్ తో సహా బయటకు వచ్చాయి. ధర్డ్ పార్టీ యాప్ ద్వారా ఈ వివరాలు బహిర్గతం కావడంతో ఇప్పుడు ఈ యాప్స్ మీద అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. 

ఆన్ లైన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు 

ఆన్ లైన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు 

ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు చేస్తున్న షాపింగ్ వివరాలు, అలాగే ఎవ్వరికీ తెలియకుండా వారు చేస్తున్న పనులు ఇలాంటి సున్నితమైన అంశాలు అన్నీ లీకయ్యాయి. ఈ సమాచారం మొత్తాన్ని ఈ యాప్స్ ధర్డ్ పార్టీకి అమ్మేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వారు ఆన్ లైన్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు బయటకు రావడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. 

Best Mobiles in India

English summary
Period tracking apps sharing sensitive user data with Facebook: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X