Philips నుంచి రెండు బ్లూటూత్ స్పీకర్‌లు.. అందుబాటు ధర సహా ఆకట్టుకొనే ఫీచర్లు..!
భారత్ మార్కెట్లో ఆడియో ఉత్పత్తులను మంచి డిమాండ్ ఉంది. అందువల్ల అనేక సంస్థలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తుంటారు. ఇందులో స్పీకర్లు, ఇయర్‌బడ్స్, నెక్‌బ్యాండ్, హెడ్‌ఫోన్స్ ఉన్నాయి. అయితే తాజాగా ప్రముఖ సంస్థ ఫిలిప్స్ TAS1400, TAS2400 రెండు బ్లూటూత్ స్పీకర్ లను విడుదల చేసింది. ఈ రెండు స్పీకర్లు పోర్టబుల్ డిజైన్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫిలిప్స్ బ్లూటూత్ స్పీకర్ల ఫీచర్లు, ధర, సేల్ పూర్తి వివరాలు.
* ఫిలిప్స్TAS1400 పూర్తి వివరాలు :
ఈ ఫిలిప్స్ TAS1400 బ్లూటూత్ స్పీకర్ (Philips TAS1400) కాంపాక్ట్ డిజైన్ తో అందుబాటలోకి వచ్చింది. అయితే మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుందని ఫిలిప్స్ చెబుతోంది. ఈ బ్లూటూత్ స్పీకర్ 52mm డైనమిక్ డ్రైవర్స్ ను కలిగి ఉంది. ఈ స్పీకర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ 20Hz టూ 20kHz గా ఉంటుంది.

12W ఆడియో అవుట్‌పుట్ :
ఫిలిప్స్ TAS1400 బ్లూటూత్ స్పీకర్ 12W ఆడియో అవుట్‌పుట్ ను అందిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 10 గంటల వరకు ప్లేటైంను పొందవచ్చని చెబుతోంది. ఇన్‌డోర్, అవుట్‌డోర్ లొకేషన్స్ లో ఉపయోగించుకొనేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుందని చెబుతోంది.
బ్లూటూత్ 5.3 :
ఈ స్పీకర్ బ్లూటూత్ 5.3 పైన పనిచేస్తుంది. ఫలితంగా మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని ఫిలిప్స్ చెబుతోంది. ఈ బ్లూటూత్ స్పీకర్ వాయిస్ అసిస్టెంట్ సపోర్టును కలిగి ఉంటుంది. మరియు ప్రత్యేకమైన బటన్ లను కూడా అమర్చి ఉంటుంది.
స్పీకర్ ధర, సేల్, కలర్ వేరియంట్స్ :
ఈ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.2599 గా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. డీప్ బ్లాక్, కోపెన్ బ్లూ, విల్లో బో వంటి మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. IPX4 రేటింగ్ తో స్ప్లాష్ రెసిస్టెంట్‌గా ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
* ఫిలిప్స్ TAS2400 బ్లూటూత్ స్పీకర్ పూర్తి వివరాలు :
ఫిలిప్స్ TAS2400 బ్లూటూత్ స్పీకర్ (Philips TAS2400) 57mm డైనమిక్ డ్రైవర్స్‌ను కలిగి ఉంది. మరియు గరిష్ఠంగా 32W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇన్‌డోర్‌తోపాటు అవుట్‌డోర్ లొకేషన్స్ లోనూ మెరుగైన అవుట్‌పుట్‌ను అందిస్తుందని ఫిలిప్స్ చెబుతోంది.
ఈ స్పీకర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 10 గంటల వరకు ప్లేటైంను పొందవచ్చని తెలిపింది. మరియు ఈ బ్లూటూత్ 5.3 పైన పనిచేస్తుందని తెలిపింది. ఫలితంగా మెరుగైన కనెక్టివిటీని కలిగి ఉంటుందని పేర్కొంది. మరియు IPX4 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
స్పీకర్ ధర, సేల్, కలర్ వేరియంట్స్ వివరాలు :
ఫిలిప్స్ TAS2400 బ్లూటూత్ స్పీకర్ ధర రూ.3499 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా రిటైల్ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్పీకర్ విల్లో బో, డీప్ బ్లాక్ రెండు కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలో తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








