Home
News

PhonePe క్యాష్‌బ్యాక్ పేరుతో ఢిల్లీ పోలీస్‌ అధికారినే మోసం చేసిన నేరగాళ్లు.. మీరు ఇలా చేయవద్దు..!!

టెక్నాలజీ అభివృద్ధి చెందుకున్న కొద్దీ సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. అత్యంత పక్కాగా ప్లాన్‌ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా ఏకంగా ఓ పోలీస్‌ అధికారినే బురిడి కొట్టించి నగదు కాజేశారు. ఫోన్‌పే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ పేరు చెప్పి మోసం చేశారు. అందినకాడికి దోచుకున్నారు.

ఢిల్లీ పోలీస్‌ విభాగానికి చెందిన ఓ అధికారికి ఓ నంబర్‌ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్‌పే నుంచి ఇటీవల చేసిన లావాదేవీపై (ట్రాన్సాక్షన్‌) క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వచ్చిందని చెప్పారు. క్యాష్‌బ్యాక్‌ను పొందాలంటే మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని.. పోలీస్‌ అధికారికి సూచించారు.

delhi police lost 2 lakh in phonepe cashback scam

అయితే ఆ యాప్‌కు ఫోన్‌పే నుంచి ఎటువంటి ధృవీకరణ లేదు. ఈ యాప్‌ ద్వారానే పోలీస్‌ అధికారిని నేరగాళ్లు మోసం చేశారు. అయితే నేరగాళ్లు చెప్పిన యాప్‌ తరచూ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ప్రకటించే యాప్‌ కావడంతో పోలీస్‌ అధికారికి ఎటువంటి సందేహం రాలేదు. చట్టబద్దమైన యాప్‌గా భావించి ఆయన డౌన్‌లోడ్‌ చేశారు.

నేరగాళ్లు చెప్పిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసిన పోలీస్ అధికారి దానిని ఇన్‌స్టాల్ చేశారు. అనంతరం పోలీస్‌ అధికారి ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి నేరగాళ్లు తీసుకున్నారు. పోలీస్‌ అధికారి బ్యాంక్‌ ఖాతా మరియు క్రెడిట్‌ కార్డు నుంచి ఏకంగా రూ. 2,12,000 కాజేశారు.

బాధిత పోలీస్‌ అధికారి ఫిర్యాదులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ బృందంలో నలుగురు సభ్యులున్నారు. ఇందులోని ఓ జంట ఖాతాకు నగదు బదిలీ చేశారు. ఈ డిజిటల్‌ ఖాతా ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లోని 5 వేర్వేరు ప్రాంతాల్లోని 5 బ్యాంకు అకౌంట్లతో లింక్‌ అయినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

నలుగురు సైబర్‌ క్రైమ్‌ నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి బ్యాంకు చెక్‌ బుక్‌లు, ఏటీఎం కార్డులు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్‌ అధికారి నుంచి నిందితులు కాజేసిన రూ. 2,12,000 నగదు మొత్తాన్ని రికవరీ చేసి.. సదరు అధికారికి అందించారు.

రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రజలు సాధారణంగా ఉపయోగించే యాప్‌లు, సర్వీసులతోనే మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌ ద్వారా జాబ్‌ ఆఫర్‌లు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలంటూ అమాయకులను టార్గెట్‌ చేస్తూ మోసం చేస్తున్నారు.

అయితే ఢిల్లీ పోలీస్‌ అధికారి కేసులో నేరగాళ్లు క్యాష్‌బ్యాక్‌ను ఆయుధంగా వాడుకున్నారు. కానీ నిజమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లు ఎప్పడూ అదే యాప్‌లో చూపిస్తాయని వినియోగదారులు గుర్తించుకోవాలి. అలాగే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌లు పొందేందుకు ఇతర థర్డ్‌పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సమయంలో మీకు ఇలాంటి ఫోన్‌లు రావొచ్చు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అప్రమత్తంగా వ్యవహరించండి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Phonepe cashback offer scam delhi police officer lost more than 2 lakh rupees
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X