PhonePe వాడుతున్నారా!! ఫెస్టివల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి మిస్ అవ్వకండి...

|

ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం ఫోన్‌పే ఇప్పుడు తన వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. ఫోన్‌పే ద్వారా తమ మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకునే వ్యక్తులు రూ.50 వరకు క్యాష్‌బ్యాక్ ను పొందుతారు. PhonePe యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు రూ.51 కంటే ఎక్కువ మూడు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లను పూర్తి చేసిన తర్వాత హామీ పొందిన క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకుంటారని కంపెనీ తెలిపింది.

ఫోన్‌పే

ఫోన్‌పే యొక్క ఈ ఆఫర్ ప్రస్తుతం అన్ని పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్‌లలో యాప్ యొక్క తాజా వెర్షన్‌లోని ఫోన్‌పే వినియోగదారులందరికీ వర్తిస్తుంది అని ఇది తెలిపింది. ఈ ఆఫర్ పొందడానికి వినియోగదారులు ఫోన్‌పే యాప్‌ని ఓపెన్ చేయండి. తరువాత మొబైల్ రీఛార్జ్‌లపై క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నంబర్‌ను ఎంచుకోవాలి మరియు వారు ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా రీఛార్జ్ చేయాలి.

Nokia నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది ! ధర మరియు ఫీచర్లు చూడండి.Nokia నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది ! ధర మరియు ఫీచర్లు చూడండి.

ఫోన్‌పేకి

ఫోన్‌పేకి 325 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. వినియోగదారులు డబ్బు పంపవచ్చు మరియు స్వీకరించవచ్చు. వీటితో పాటుగా మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జ్ చేయవచ్చు, స్టోర్లలో చెల్లించవచ్చు, యుటిలిటీ చెల్లింపులు చేయవచ్చు, బంగారం కొనుగోలు చేయవచ్చు మరియు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు.

PhonePe

PhonePe 2017లో గోల్డ్ లాంచ్‌తో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించింది. దాని ప్లాట్‌ఫారమ్‌లో 24-క్యారెట్ బంగారాన్ని సురక్షితంగా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు సురక్షితమైన మరియు అనుకూలమైన ఎంపికను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ భారతదేశవ్యాప్తంగా 22 మిలియన్లకు పైగా మర్చంట్ ఔట్‌లెట్లలో కూడా ఆమోదించబడింది.

Paytm

Paytm

ఇండియా యొక్క స్వదేశీ డిజిటల్ పేమెంట్ కంపెనీ Paytm తన యాప్‌లో డిజిలాకర్ కార్యాచరణను అనుసంధానం చేసింది. ఈ ఇంటిగ్రేషన్‌తో ఇది ఇప్పుడు Paytm లో DigiLocker Mini App ద్వారా అన్ని ప్రభుత్వ రికార్డులను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి వినియోగదారులు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వెహికల్ ఆర్‌సి, కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ వంటి ముఖ్యమైన డాక్యుమెంట్‌లను జోడించవచ్చు మరియు తిరిగి పొందవచ్చు. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ క్లౌడ్ ఆధారిత సర్వీస్ రన్ అవుతుంది. ఇది సంబంధిత ప్రభుత్వ సర్టిఫికెట్‌లను డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. IT (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చట్టం 2000 ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో సమానంగా డిజిలాకర్ డాక్యుమెంట్‌లు చట్టపరంగా గుర్తించబడతాయి.

DigiLocker

ఇంటిగ్రేషన్ విషయానికొస్తే Paytm దాని బ్యాక్ ఎండ్‌లో డాక్యుమెంట్-సంబంధిత సమాచారాన్ని స్టోర్ చేయదు లేదా పంపదు. అలాగే యూజర్ల డేటా స్థానికంగా వారి డివైజ్‌లో ఉండిపోతుంది కాబట్టి డివైజ్ ఆఫ్‌లైన్ లేదా తక్కువ కనెక్టివిటీలో ఉంటే సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇంకా Paytm యాప్ ద్వారా కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను బుక్ చేసుకున్న వారు తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను ఒకే క్లిక్‌తో డిజిలాకర్‌కు జోడించవచ్చు. "డిటిలాకర్ కార్యాచరణను Paytm యాప్‌కు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము. వ్యాక్సిన్ బుకింగ్, ట్రావెల్, ఫాస్ట్ ట్యాగ్, ఇన్సూరెన్స్, KYC మరియు అనేక ఇతర అవసరాల కోసం Paytm యాప్‌ని తెరిచిన మిలియన్ల మంది వినియోగదారులు ముఖ్యమైన డాక్యుమెంట్‌లకు సౌలభ్యం మరియు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పించే DigiLocker ఫంక్షనాలిటీకి హర్షం వ్యక్తం చేస్తారు "అని Paytm ప్రతినిధి తెలిపారు. ఒకవేళ Paytm ఉపయోగిస్తుంటే మరియు మీ డిజిలాకర్ పత్రాలను చూడాలనుకుంటే కొన్ని సాధారణ గైడ్లను ఉపయోగించి సులభంగా చూడవచ్చు.

Best Mobiles in India

English summary
PhonePe Festival Cashback Offers on Mobile Recharges: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X