ఫోన్‌పే కీబోర్డ్ యాప్ గురించి ఎవరికైనా తెలుసా, ఎనేబుల్ చేయడం ఎలా ?

ఫోన్‌పే అనేది ఓ పాపులర్ డిజిటల్ పేమెంట్ యాప్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ పేమెంట్ యాప్ ఇండియాలో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఇండియాలో ఫోన్‌పే యాప్ తొలిసారిగా పీర్ టూ పీర్ ట్రాన్సిక్షన్స్

|

ఫోన్‌పే అనేది ఓ పాపులర్ డిజిటల్ పేమెంట్ యాప్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ పేమెంట్ యాప్ ఇండియాలో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. ఇండియాలో ఫోన్‌పే యాప్ తొలిసారిగా పీర్ టూ పీర్ ట్రాన్సిక్షన్స్ కోసం కీబోర్డ్ ను ప్రవేశపెట్టింది. ఈ కీబోర్డ్ యాప్ ద్వారా యుపిఐ ను ఉపయోగించి డబ్బులను పంపుకోవడం కాని అలాగే రిసీవ్ చేసుకోవడం కాని చేయవచ్చు. బెంగుళూరు కేంద్రంగా నడుస్తోన్న ఫోన్‌పే సంస్థ డిజిటల్ లావాదేవీలు మరింత సౌకర్యవంతంగా జరగడానికి కీబోర్డ్ ని ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ఫోన్‌పే కీబోర్డ్ యాప్ గురించి ఎవరికైనా తెలుసా, ఎనేబుల్ చేయడం ఎలా ?

ఈ కొత్త కీ బోర్డ్ యాప్ గూగుల్ కీ బోర్డుని పోలి ఉంటుంది. కీబోర్డుతో పాటు Q బటన్ ని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ బటన్ ద్వారా యూజర్లు పేమెంట్లు చేయడం అలాగే బ్యాలన్స్ చెక్ చేయడం వంటి వాటిని ఈజీగా చేయవచ్చు. ఇలాంటి కీబోర్డుని తొలిసారిగా ఫోన్‌పే మాత్రమే ప్రవేశపెట్టింది. మరి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఓ సారి చూద్దాం.

ఫోన్‌పే యాప్

ఫోన్‌పే యాప్

మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ముందుగా ఫోన్‌పే యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అది యాడ్ ఇన్ స్టాల్ చేసుకున్న వెంటనే సెండ్ రిక్వెస్ మనిని ఈజీగా పంపుకోవచ్చు. మీరు ఇతయ యాప్స్ వాడుతున్నప్పటికీ వెంటనే మనీ పంపుకునే వెసులుబాటు ఉంది.

ఇతర యాప్స్ వాడే సమయంలో..

ఇతర యాప్స్ వాడే సమయంలో..

మీరు ఫేస్ బుక్ స్టేటస్ లో ఉన్న సమయంలో కాని అలాగే ఈ కామర్స్ ఫ్లాట్ ఫాంలు ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ లను ఉపయోగిస్తున్నప్పుడు అలాగే ఫ్లిప్ కార్ట్ , అమెజాన్ , గూగుల్ డాక్యుమెంట్స్, మైక్రోసాఫ్ట్ వర్డ్ , ఈమెయిల్ వంటి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు నేరుగా మీరు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. వాటిని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు.

కీబోర్డును ఎనేబుల్ చేసుకోవడం ఎలా ?

కీబోర్డును ఎనేబుల్ చేసుకోవడం ఎలా ?

మీరు యాప్ ఓపెన్ చేసిన తరువాత ఎడం వైపున కనిపించే ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అక్కడ కనిపించే మై అడ్రస్, మై భీమ్ యుపిఐ ఐడీ లను ఓ సారి పరిశీలించండి. అక్కడ మీకు Setup PhonePe keyboard అనే ఆప్సన్ కనిపిస్తుంది.

ఎనేబుల్ చేయండి

ఎనేబుల్ చేయండి

అక్కడ మీకు కనిపించే ఆ కీబోర్డుని ఎనేబుల్ చేయండి. ఆ తర్వాత మీరు ఢీపాల్ట్ కీబోర్డు ఫోన్ పే కీబోర్డుగా మారిన సంగతిని గ్రహిస్తారు. కీబోర్డ్ రెడీ అయిన తరువాత మీరు యుపిఐ డిజిటల్ పేమెంట్స్ ని పంపుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ సొంతమైన ఈ ఫోన్ పే యాప్ 150 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. 50 మిలియన్ల మంది యూజర్లు యాక్టివ్ గా ఉంటున్నారు.

అన్ని లావాదేవీలు

అన్ని లావాదేవీలు

ఈ యాప్ ద్వారా మీరు అన్ని రకాల లావాదేవీలను జరపవచ్చు. ఇండియాలోనే అత్యధికంగా డిజిటల్ పేమెంట్లు చేసే యాప్ లో ఇది మొదటి స్థానంలో ఉందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. డీటీహెచ్ అలాగే మొబైల్ రీఛార్జ్ లు , యుటిలిటీ బిల్స్ మొదలైనవి మీరు పేమెంట్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
PhonePe introduces ‘keyboard’ app to make UPI-based digital payments easie

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X