PhonePe Biometric : ఫోన్‌పేలో బయోమెట్రిక్ ఆప్షన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
భారత్‌లో యూపీఐ (UPI) లావాదేవీలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం అనేక యూపీఐ పేమెంట్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. యూపీఐ పేమెంట్స్ కోసం పిన్‌తోపాటు బయోమెట్రిక్ ద్వారా పేమెంట్స్ పూర్తి చేసేలా వ్యవస్థ తీసుకొస్తామని గతంలోనే NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. గత సంవత్సరం చివర్లో అమెజాన్ పే ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా ఫోన్‌పే (PhonePe) ఈ ఫీచర్ ను లాంచ్ చేసింది.
ప్రస్తుతానికి రూ.5000 వరకు మాత్రమే :
ఫోన్ పే ద్వారా ఫింగర్ ప్రింట్, ముఖ గుర్తింపు ఆధారంగా యూపీఐ పేమెంట్స్ పూర్తి చేసే సౌలభ్యం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. దీంతో పేమెంట్ సమయంలో పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే బయోమెట్రిక్ ద్వారా ప్రస్తుతానికి కేవలం రూ.5000 వరకు మాత్రమే లావాదేవీలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంది.

త్వరలో ఈ యూజర్లకు :
అయితే బయోమెట్రిక్ అందుబాటులోకి వచ్చినా, పాత విధానంలో పిన్ ద్వారా కూడా ఫోన్‌పే పేమెంట్స్ పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే బయోమెట్రిక్ విధానంలో పేమెంట్స్ పూర్తి చేసేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది, iOS యూజర్లకు ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
ఫోన్‌పేలో బయోమెట్రిక్ పేమెంట్స్ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
స్టెప్ 1 : ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయాలి.
స్టెప్ 2 : ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : అనంతరం మేనేజ్ పేమెంట్స్ పైన క్లిక్ చేయాలి.
స్టె్ప్ 4 : ఆ తర్వాత బయోమెట్రిక్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 5 : అక్కడ మీ బ్యాంకు ఖాతాలు కనిపిస్తాయి. అక్కడే బయోమెట్రిక్‌ను యాక్టివేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
స్టెప్ 6 : యూపీఐ పిన్, బయోమెట్రిక్ ను నమోదు చేసి, యాక్టివేట్ చేసుకోవచ్చు.
బయోమెట్రిక్ ఫీచర్‌తో పేమెంట్స్ చేసే ప్రతిసారి 4 లేదా 6 అంకెల యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో మీ పిన్‌ను బహిర్గతం చేయాల్సిన అవసరం లేకుండా ఫింగర్ ప్రింట్ లేదా ముఖ గుర్తింపు ఆధారంగా పేమెంట్స్ పూర్తి చేయవచ్చు.

అమెజాన్ పే లో పేమెంట్స్ కోసం బయోమెట్రిక్ ఆప్షన్‌ను గత సంవత్సరం డిసెంబర్‌లో తీసుకొచ్చింది. గరిష్ఠంగా రూ.5000 వరకు ఫింగర్ ప్రింట్, ముఖ గుర్తింపు ద్వారా పేమెంట్స్ పూర్తి చేసేందుకు అవకాశం ఉంది. దేశంలో యూపీఐ పేమెంట్స్ కోసం బయోమెట్రిక్ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి ప్లాట్‌ఫాంగా అమెజాన్ పే నిలిచింది.
అమెజాన్ పే ప్లాట్‌ఫాంలో పిన్ నమోదు చేయడంతో పోలిస్తే, బయోమెట్రిక్ విధానంలో చాలా తక్కువ సమయంలోనే పేమెంట్స్ పూర్తి చేయవచ్చని గతంలోనే తెలిపింది. భద్రత పరంగానూ సురక్షితంగా ఉంటుందని చెబుతోంది. బయోమెట్రిక్ డేటా క్లౌడ్‌లో కాకుండా యూజర్ ఫోన్‌లోనే భద్రపరిచి ఉంటుందని, ఫలితంగా డేటా చోరీ ఆందోళన అవసరం లేదని గతంలోనే చెప్పింది.


Click it and Unblock the Notifications
