Home
News

PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు

ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆన్‌లైన్ పద్దతిలో పేమెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ కోసం అనేక రకాల వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో PhonePe కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఫోన్‌పే తన యొక్క వినియోగదారుల కోసం కొత్త ప్రొడెక్టుని ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా బంగారం కొనుగోలు కోసం పెట్టుబడుల SIP(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) చేయగలరు. ప్రపంచంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి SIPలు చాలా సాధారణమైనవి మరియు ప్రసిద్ధమైనవి. ప్రతి నెలా పెట్టుబడి కోసం చిన్న మొత్తాన్ని కేటాయించే వినియోగదారులు భవిష్యత్తులో ఎక్కువ రాబడిని పొందడానికి SIP విధానంపై ఆధారపడతారు. భారతీయ వినియోగదారులు ఫోన్‌పే ద్వారా బంగారంను కొనుగోలు చేయడం కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని పెట్టడానికి అదే మోడల్‌ను ప్రారంభించింది. దీని గురించి గొప్ప విషయం ఏమిటంటే వినియోగదారులు ఇప్పుడు బంగారం కొనుగోలుకు SIP పెట్టుబడులు చేయడానికి UPIపై ఆధారపడవచ్చు.దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

PhonePe Launches UPI SIP For Gold Investments: Here are Full Details

ఫోన్‌పే బంగారం కోసం రూ.100లతో SIP పెట్టుబడి

భారతీయ వినియోగదారులు బంగారం కొనుగోలు కోసం నెలకు 100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫోన్‌పే వినియోగదారులు SIP పెట్టుబడితో అధిక స్వచ్ఛతతో 24k బంగారంను పొందవచ్చు. బంగారంపై పెట్టుబడిని పెట్టి దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని పొందాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. SIPపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉంటుందని మరియు వారు కోరుకున్నప్పుడు బంగారాన్ని విక్రయించవచ్చని ఫోన్‌పే తెలిపింది. విక్రయించిన బంగారంతో సంబంధించిన డబ్బు నేరుగా వినియోగదారుల బ్యాంకు అకౌంటులలో జమ అవుతుంది.

PhonePe Launches UPI SIP For Gold Investments: Here are Full Details

ఫోన్‌పే ద్వారా బంగారం కొనుగోలుపై SIP పెట్టుబడులు చేయడం కోసం వినియోగదారులు ముందుగా గోల్డ్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. తరువాత వారు ప్రతి నెల చెల్లించే మొత్తాన్ని పేర్కొనాలి. ఆ తరువాత వారి UPI పిన్‌ను నమోదు చేయడం ద్వారా లావాదేవీని యాక్సిస్ చేయవచ్చు.

SIPని సెటప్ చేయడం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆపై వినియోగదారులు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా వినియోగదారులు తమ నగదు పెట్టుబడిని బంగారు కడ్డీ లేదా బంగారు నాణెం రూపంలో రీడీమ్ చేసుకోవడానికి కూడా ఎంచుకోవచ్చు. అది వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడుతుంది. ఇది PhonePe నుండి ఒక గొప్ప ఆఫర్ మరియు ఇది మిలియన్ల మంది భారతీయులను సంతోషపరుస్తుంది.

Best Mobiles in India

English summary
PhonePe Launches UPI SIP For Gold Investments: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X