మీకు ఇలాంటి మెసెజ్‌లు వస్తున్నాయా.. అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే..!!
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా అమాయకులు మోసపోతున్నారు. తాజాగా నకిలీ SMS లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఇండియా పోస్ట్ పేరుతో SMS (India Post Fake SMS Scam) లను పంపుతున్నారు. అడ్రస్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని లేకుంటే పార్శిల్ డెలివరీ చేయలేమంటూ మెసెజ్‌లు పంపుతున్నారు. PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఈ మెసెజ్‌లు నకిలీవని ఎవరూ స్పందించవచ్చని సూచించింది. మీ వ్యక్తిగత వివరాలు వారితో షేర్ చేసుకోవద్దని హెచ్చరించింది.
దీనిపై ఇండియా పోస్ట్ కూడా తన అధికారిక X అకౌంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసింది. కస్టమర్లు మోసపోవద్దని కోరింది. అయితే ఈ నకిలీ మెసెజ్‌లు ఎలా పంపుతున్నారో కూడా వెల్లడించింది. 'మేము మీ అడ్రస్‌కు ప్యాకేజీ పంపంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు మరిన్ని వివరాలు కావాల్సి ఉంది. మేము పంపిన లింక్‌లో మీ అడ్రస్ సహా ఇతర వివరాలు అప్‌డేట్ చేయాలి.' అంటూ హానికర లింక్‌లతో కూడిన మెసెజ్‌లను పంపుతున్నారు.

ఈ మెసెజ్‌ల పట్ల అప్రమత్తంగా (PIB FactCheck) ఉండాలని. ఎట్టిపరిస్థితుల్లోనూ లింక్‌ను క్లిక్ చేయవద్దని అప్రమత్తం చేసింది. ఈ లింక్ క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత, సున్నితమైన వివరాలు దొంగిలించబడతాయని పేర్కొంది. దీంతోపాటు ఈ తరహా నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలి. సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో కూడా ఇండియా పోస్ట్ వెల్లడించింది.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసెజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్ల నుంచి వచ్చిన SMS లలో ఎటువంటి వ్యక్తిగత సమాచారం షేర్ చేయమని కోరినా స్పందించకూడదు. ఏదైనా సందర్భంలో స్పందించాల్సి వస్తే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
Scam Alert! Fraudsters are targeting India Post customers, claiming delivery issues. Don’t share any personal details over any link. Stay vigilant and report suspicious calls, messages, or emails immediately at the Chakshu Portal: https://t.co/tXsFXeXrsD pic.twitter.com/uZkMSWSzrY
— India Post (@IndiaPostOffice) September 16, 2024
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా మీ ఆన్‌లైన్ ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు అందిస్తున్న సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఉపయోగించుకోవాలి. మరియు అదనపు భద్రత కోసం Two Factor Authentication ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
దీంతోపాటు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసెజ్‌లలో ఉన్న లింక్స్‌ను క్లిక్ చేయవద్దు. దీంతోపాటు మీ వ్యక్తిగత సమాచారం సహా బ్యాంకు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల సమాచారం ఎవరికీ షేర్ చేయకూడదు. అనుమానాస్పద లింక్‌లు తరచూ వస్తుంటే సంబంధించి విభాగాలకు ఫిర్యాదు చేయాలి. లేదా మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి.
అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫలితంగా భారీ సంఖ్య లో ప్రజలను మోసం చేస్తున్నారు. లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. ఇండియా పోస్ట్ పేరుతో తాజాగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ లింక్ లు పంపి, వ్యక్తిగత డేటాను దొంగలిస్తున్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








