ఇండియా పోస్ట్ పేరుతో మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక సూచనలు..!
భారత్‌లో ఆన్‌లైన్ స్కామ్‌లు క్రమంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ సంస్థల పేరుతో అనేక మోసాలకు పాల్పడుతున్నారు, అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటువంటి ఘటనలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక వివరాలను షేర్ చేసింది.
ఇండియా పోస్ట్ (india post) పేరుతో ప్రజలను మోసం చేసేందుకు నేరగాళ్లు ప్రయత్నం చేస్తున్నట్లు ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. నేరగాళ్లు నకిలీ SMS లు పంపుతూ ఇండియా పోస్ట్ యూజర్లను మోసం చేస్తున్నట్లు వెల్లడించింది. నకిలీ SMS ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నేరగాళ్లు ఎలా మోసాలు చేస్తున్నారు? :
ఇండియా పోస్ట్ పేరుతో నేరగాళ్లు నకిలీ మెసేజ్‌లు పంపుతున్నారు. మీకు వచ్చిన పార్శిల్‌లో అడ్రస్ పూర్తిగా లేదని, SMS లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి, అడ్రస్ వివరాలు పూర్తిగా నమోదు చేయాలని కోరుతున్నారు. నిర్దేశిత సమయంలో అడ్రస్ అప్‌డేట్ చేయకపోతే, పార్శిల్ వెనక్కి వెళ్లిపోతుందని చెబుతున్నారు.
సరైన అవగాహన లేకపోవడం, తొందరపాటు కారణంగా నకిలీ మెసేజ్‌లలోని లింక్ పైన క్లిక్ చేసి, అడ్రస్ వివరాలను అప్‌డేట్ చేస్తున్నారు. అనంతరం పేమెంట్ కూడా పూర్తి చేస్తున్నారు. దీంతో నేరగాళ్లు ఆ ఖాతా నుంచి నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు.
Have you also received an SMS stating that your package has arrived at the warehouse, further asking you to update your address details within 24 hours to avoid the package being returned❓#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) February 10, 2026
❌ Beware! This message is #Fake
✅ India Post never sends such… pic.twitter.com/bqY6EFzyyX
ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక సూచనలు :
ఈ తరహా ఘటనలపై PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం కీలక సూచనలు చేసింది. ఇండియా పోస్ట్ నుంచి అడ్రస్ అప్‌డేట్ చేయమని, లింక్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాలని ఎప్పుడూ కోరదని చెబుతోంది. యూజర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తోంది.
ఎప్పుడైనా ఈ తరహా మెసేజ్‌లు వచ్చినప్పుడు అందులోని వివరాలను పూర్తిగా తనిఖీ చేయాలని సూచిస్తోంది. నేరగాళ్లు పంపిన లింక్ పైన క్లిక్ చేయగానే, ఇండియా పోస్ట్ తరహాలోని నకిలీ వెబ్‌సైట్‌కు రీ -డైరెక్ట్ అవుతుంది. అలాంటి సమయాల్లో వెబ్‌సైట్ URL సరైనదో కాదు తనిఖీ చేసుకోవాలని చెబుతోంది.
ఎటువంటి అనుమానం వచ్చిన వ్యక్తిగత వివరాలతోపాటు బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేయవద్దని సూచిస్తోంది. ఇండియా పోస్ట్ ఎప్పుడూ ఈ తరహా మెసేజ్‌లు పంపదని, ఈ విషయాన్ని యూజర్లు గుర్తుంచుకోవాలని చెబుతోంది. ఇందుకు సంబంధించిన X హ్యాండిల్ ద్వారా కీలక సూచనలు చేసింది.
ఇలాంటి మోసాలబారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి
> మీకు అనుమానాస్పదంగా అనిపించిన మెసేజ్‌లకు స్పందించవద్దు.
> ఎటువంటి సమాచారం కావల్సినా లేదా ఇండియా పోస్ట్ పార్శిల్ ట్రాకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను వెళ్లండి.
> ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే మెసేజ్‌లోని లింక్ పైన క్లిక్ చేయవద్దు. నిర్దారణ లేకుండా వారు చెప్పిన లింక్ పైన క్లిక్ పేమెంట్లు చేయవద్దు.
> వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సేవ్ చేసుకొనేందుకు ఏ వెబ్‌సైట్‌కు కూడా అనుమతులు ఇవ్వొద్దు.
> ఈ తరహా మెసేజ్‌లు తరచూ వస్తున్నా, సరైన అవగాహన లేక, ఈ తరహా లింక్స్ పైన క్లిక్ చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.


Click it and Unblock the Notifications








