Home
News

మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా... స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు..!!

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో దోపిడీలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇండియా పోస్ట్‌ పేరుతో (Fake India Post Scam) నేరగాళ్లు.. అనేక మందికి మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లో లింక్ ద్వారా వివరాలు అప్‌డేట్‌ చేయాలని కోరుతున్నారు. అయితే దీనిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్ విభాగం (PIB Fact Check Team) రంగంలోకి దిగింది. ఆ మెసేజ్‌ నకిలీదని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇటీవల కాలంలో ఇండియా పోస్ట్ పేరుతో అనేక మందికి ఓ మెసేజ్ వస్తోంది. మీ కొరియర్‌ వేర్‌హాస్‌కు చేరుకుందని. కింద ఇచ్చిన లింక్‌లో మీ అడ్రస్‌ను అప్‌డేట్‌ చేయాలని కోరుతున్నారు. లేకుంటే 48 గంటల్లో మీ కొరియర్‌ వెనక్కి వెళ్లిపోతుందని చెబుతున్నారు. ఈ మెసేజ్‌పై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్ స్పందించింది.

india post fake message scam PIB fact check team key suggestion via X post

మెసేజ్‌ నకిలీదని, ఎవరూ స్పందించవద్దని సూచించింది. మెసేజ్‌లో వచ్చిన లింక్‌పైన క్లిక్‌ చేస్తే.. మీ బ్యాంకు ఖాతాల్లోని నగదు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇండియా పోస్ట్‌ సంస్థ ఎప్పుడు కూడా ఈ తరహా మెసేజ్‌లు పంపదని, వివరాలు అప్‌డేట్‌ చేయాలని కోరే అవకాశం లేదని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలతో X (ట్విట్టర్‌) లో పోస్టే చేసింది.

ఈ నకిలీ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను క్లిక్‌ చేస్తే వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. లేదా మీ పరికరాల్లో హానికర సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ తరహా మెసేజ్‌లకు స్పందించవచ్చని సూచించింది.

ఏదైనా సంస్థ నుంచి వచ్చిన మెసేజ్‌లపై స్పందించే ముందు లేదా వారిచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసే ముందు.. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇండియా పోస్ట్‌ వంటి సంస్థ అధికారికంగా ధ్రువీకరించిన వ్యవస్థల నుంచి మాత్రమే వస్తాయి. అందుకే మెసేజ్‌ పంపిన వారి వివరాలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలి.

తెలియని వ్యక్తులు లేదా వ్యవస్థల నుంచి వచ్చిన మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఈ తరహా లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా ప్రమాదకర లేదా హానిచేసే వెబ్‌సైట్‌ల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడే అవకాశం ఉంది. ఈ తరహా మెసేజ్‌లపై ఎటువంటి సందేహం వచ్చినా.. సంస్థ అధికారిక మెయిల్‌ లేదా కస్టమర్ సర్వీక్‌ కేంద్రాల ద్వారా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.

దీంతోపాటు తన ఫోన్‌లు ఇతర డిజిటల్ పరికరాలు ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా ఈ తరహా ప్రమాదకర లింక్‌లు లేదా హానికర యాప్‌ల నుంచి రక్షణ పొందవచ్చు. తెలియని వ్యక్తులు లేదా ఇతర వ్యవస్థల నుంచి వచ్చిన ఇటువంటి మెసేజ్‌లపై పూర్తిస్థాయిలో తెలుసుకున్నాకే స్పందించాలి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
PIB fact check team alerts users on india post fake message scam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X