Fact Check 'మీకు పార్శిల్ వచ్చింది.. అడ్రస్ అప్‌డేట్ చేసుకోండి' అనే మెసేజ్ వచ్చిందా..?
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు (Cyber Crimes) పాల్పడుతున్నారు. అమాయకులకు ఆశపెట్టి భారీగా దోచుకుంటున్నారు. టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకొని, మోసాలు చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్‌లు, ఓటీపీ, KYC వంటి మార్గాల్లో మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా నయా పంథాలో అమాయకులకు ఎర వేస్తున్నారు.
అంతా ఫేక్ :
నకిలీ లింక్స్, నకిలీ మెసేజ్‌లు పంపి, అందినకాడికి దోచుకుంటున్నారు. ఇండియన్ పోస్టల్ విభాగం పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపి మోసం చేస్తున్నారు. మీకు పార్శిల్ వచ్చిందని, వెంటనే అడ్రస్ అప్‌డేట్ చేయాలంటూ నకిలీ లింక్స్ పంపుతున్నారు.

ఇండియన్ పోస్టల్ విభాగం పేరుతో వస్తున్న నకిలీ లింక్స్, నకిలీ మెసేజ్‌లపై PIB Fact Check విభాగం స్పందించింది. ఇలాంటి లింక్స్ ను క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ అడ్రస్ అప్‌డేట్ కోసం ఈ తరహా మెసేజ్, లింక్స్ ఎప్పుడూ పంపదని ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పష్టం చేసింది. ఇలాంటి మోసపూరిత లింక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎలాంటి మెసేజ్‌లు వస్తున్నాయ్ :
మీ పేరుతో ప్యాకేజీ వచ్చిందని, అయితే అందులో అడ్రస్ సక్రమంగా లేదని, వెంటనే అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలని నకిలీ మెసేజ్, లింక్స్ సైబర్ నేరగాళ్లు పంపుతున్నట్లు గుర్తించామని PIB ఫ్యాక్ట్‌చెక్ విభాగం తెలిపింది. 48 గంటలల్లోగా లింక్ లో అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలని నేరగాళ్లు సూచిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :
అడ్రస్ అప్‌డేట్ చేసిన 24 గంటల్లో పార్శిల్ డెలివరీ చేస్తామని ఇండియా పోస్ట్ పేరుతో నేరగాళ్లు నకిలీ మెసేజ్ లు పంపుతున్నారని తెలిపింది. ఇండియా పోస్ట్ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Have you also received an SMS stating that your package has arrived at the warehouse, further asking you to update your address details within 24 hours to avoid the package being returned❓#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) September 14, 2025
❌ Beware! This message is #Fake
✅ India Post never sends such messages… pic.twitter.com/xIPFrtjpgB
ఈ స్కామ్ కు సంబంధించిన మెసేజ్, లింక్స్ ను తన X హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఇలాంటి లింక్స్ ను క్లిక్ చేయవద్దని సూచించింది. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లు, కార్యాలయాలను మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి :
> ఇలా వచ్చిన నకిలీ లింక్స్ పైన క్లిక్ చేస్తే. మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు చోరీకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
> కొత్త నంబర్ల నుంచి వచ్చిన మెసెజ్ ల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇలా వచ్చిన SMS లలో ఎటువంటి వ్యక్తిగత సమాచారం షేర్ చేయమని కోరినా స్పందించకూడదు.
> కొత్త నంబర్ల నుంచి వచ్చిన మెసెజ్‌లలో ఉన్న లింక్స్ ను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
> ఈ తరహా మెసేజ్ లు ఎక్కువగా వస్తుంటే, సంబంధిత విభాగాలు, నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కు ఫిర్యాదు చేయాలి.
> ఆన్‌లైన్ ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్ లను ఏర్పాటు చేసుకోవాలి. అదనపు భద్రత కోసం Two Factor Authentication యాక్టివేట్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications