ఎమర్జన్సీ ఫోన్ ఛార్జర్!

By Prashanth
|
Pico Power


పోర్టబుల్ ఇంకా డిజిటల్ ఉపకరణాల తయారీ సంస్థ పోర్‌ట్రానిక్స్ ఇండియా, ‘పికో పవర్’ పేరుతో సరికొత్త ఎమర్జన్సీ ఫోన్ ఛార్జ‌ర్‌ను ఆవిష్కరిచింది. ఈ ఎమర్జన్సీ ఫోన్ ఛార్జర్ అత్యవసర సమయాల్లో మొబైల్ ఫోన్‌లకు శక్తిని సమకూరుస్తుంది. ధర రూ.799. ఈ పోర్టబుల్ ఎమర్జనీ ఛార్జర్‌ను యూఎస్బీ ఇంటర్‌ఫేస్ ఆధారంగా మొబైల్‌ఫోన్‌లకు జత చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఛార్జర్ మూడు గంటల పాటు నిరంతరాయంగా శక్తిని మంజూరు చేయగలదు.

గవర్నర్ రాసలీలల నుంచి బుల్లితెర భాగోతాల వరకు....

పికో పవర్ ఎమర్జన్సీ ఫోన్ ఛార్జర్ కీలక ఫీచర్లు:

బుల్ట్ -ఇన్ 900 ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,

3 గంటలు టాక్‌టైమ్,

ఎల్ఈడి పవర్ ఇండికేటర్

మైక్రోయూఎస్బీ ఇంటర్ ఫేస్.

డోంట్ వర్రీ!!..అప్పటికప్పుడు ఫుల్ ఛార్జ్!

ప్రయాణంలో ఉన్నప్పుడే మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా..?, ఏం పర్వాలేదు రెప్పపాటులో తిరిగి ఛార్జ్ చేసుకోవచ్చు…, అంత ఫాస్టుగా ఏలా సాధ్యమనుకుంటున్నారా..?, మార్కెట్లో విడుదలైన మోజో కార్డ్‌లెస్ ఛార్జర్ ద్వారా ఇది సాధ్యమే. ఈ పోర్టబుల్ డివైజ్‌ను మీ వెంట పెట్టకుంటే చాలు.. అత్యవసరం సమయాల్లో ఛార్జింగ్ లేదన్న బెడదే ఉండదు. ఈ పోర్టబుల్ ఛార్జర్ బాహ్య విద్యుత్ సరఫరా లేకుండా మొబైల్ ఫోన్, ఐపోడ్, ఐఫోన్, మ్యూజిక్ ప్లేయర్లతో పాటు ఇతర గేమింగ్ డివైజ్‌లను అప్పటికప్పుడే ఛార్జ్ చేసేస్తుంది.

ఈ డివైజ్‌లో పొందుపరిచిన లెవల్ ఇండికేటర్ టెక్నాలజీ, మీ గ్యాడ్జెట్ బ్యాటరీ స్థాయిని గుర్తించి క్షణాల్లో ఆ ఖాళీని భర్తి చేస్తుంది. శక్తవంతమైన 2200mAh లయాన్ రీఛార్జబుల్ బ్యాటరీలను ఈ కార్డ్‌లెస్ ఛార్జర్‌లో నిక్షిప్తం చేయ్యటం కారణంగా విద్యుత్ నిల్వ ఉంటుంది. ఈ విద్యుత్‌ను ఛార్జింగ్ అవసరమైన వాటిలోకి చిన్న కేబుల్ ఆధారితంగా షేర్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో మోజో కార్డ్‌లెస్ స్పీకర్ ధర రూ.1000.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X