సీనియర్‌ సిటిజన్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌ను కొంటున్నారా?? ఈ విషయాలు గుర్తుంచుకొండి!!

|

టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతున్నందున కొత్త స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత అయోమయంగా మరియు సంక్లిష్టంగా మారుతున్నాయి. లేటెస్ట్ ఇన్-బిల్ట్ అప్లికేషన్‌లు అధికంగా ఉన్నందున కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం వృద్ధులకు మరింత సవాలుగా మారుతున్నాయి. ఈ పాకెట్ కంప్యూటర్ అనేక విధాలుగా ఉపయోగపడుతున్నప్పటికి మీ తల్లిదండ్రులు లేదా తాతామామలకు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేసేటప్పుడు వారు ఉపయోగించడానికి వీలుగా ఉండే మరియు ఉపయోగించడంలో క్లిష్టతరంను తగ్గించడం కోసం అనేక విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ గమనించదగ్గ విషయాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో వృద్ధులకు అతి పెద్ద సమస్యగా మారేది ఫోన్‌లో గల ఇన్‌బిల్ట్ అప్లికేషన్‌లను ఉపయోగించడం. ఈ రోజుల్లో డబ్బును బదిలీ చేయాలా లేదా గూగుల్ మరియు యాహూ మెసెంజర్‌లో చాట్ చేయాలా అని కుస్తీలు పడుతూ ఉంటారు. మీ యొక్క మొబైల్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ స్నేహితులతో క్షణంలో కనెక్ట్ అవ్వండి. అంతేకాని సీనియర్ సిటిజన్‌లకు ఉపయోగపడే అప్లికేషన్‌లను మాత్రమే సెటప్ చేసి వారికి ఇవ్వండి. అధిక యాప్ లను ఉపయోగించడం కూడా స్మార్ట్‌ఫోన్‌ అధికంగా హీట్ అవుతుంది.

ఎయిర్‌టెల్, జియో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు యూజర్లకు ఎంతమేర సహాయపడతాయి!!ఎయిర్‌టెల్, జియో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు యూజర్లకు ఎంతమేర సహాయపడతాయి!!

స్క్రీన్ లాక్ సెక్యూరిటీ

స్క్రీన్ లాక్ సెక్యూరిటీ

స్మార్ట్‌ఫోన్‌లు పిన్ కోడ్, స్క్రీన్ లాక్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్‌లను సెట్ చేయడం వంటి సెక్యూరిటీ ఆప్షన్‌తో వస్తాయి. అయితే ఈ సెక్యూరిటీ ఆప్షన్‌ని ఉపయోగించకపోవడం ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ మీరు వృద్ధుల కోసం స్మార్ట్‌ఫోన్‌ను సెటప్ చేసినప్పుడు స్క్రీన్ లాక్‌ను మాత్రమే ఎంచుకోండి. మీరు సెట్టింగ్‌లు> సెక్యూరిటీ> స్క్రీన్ లాక్ ఎంపికకు వెళ్లి సెట్ చేయవచ్చు.

షార్ట్‌కట్‌లను ఉపయోగించండి
 

షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

మీరు తరచుగా ఉపయోగించే యాప్‌లకు షార్ట్‌కట్‌లను కూడా జోడించవచ్చు. మీరు చేయగలిగే అత్యంత ఉపయోగకరమైన విషయాలలో ఒకటి హోమ్ స్క్రీన్‌పై స్టేటస్ షార్ట్‌కట్‌లను జోడించడం ద్వారా వారికి టెక్స్ట్ మెసేజ్ పంపడం లేదా మీ దగ్గరి కాంటాక్ట్‌లను ఒకే ట్యాప్ ద్వారా కాల్ చేయడం సులభం చేస్తుంది.

అంతర్నిర్మిత వాయిస్ కమాండ్

అంతర్నిర్మిత వాయిస్ కమాండ్

చాలాసార్లు సీనియర్ సిటిజన్స్ ఫోన్ నంబర్ డయల్ చేయలేకపోవడం మరియు మెనూల ద్వారా నావిగేట్ చేయలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంతర్నిర్మిత వాయిస్ కమాండ్ ను ప్రారంభించడం ఇది ఒక రక్షకునిగా వస్తుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది.

స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన డిస్‌ప్లే

స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన డిస్‌ప్లే

సీనియర్‌ సిటిజన్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లలో ప్రతిదీ సరళంగా ఉండాలి. కాబట్టి డిస్‌ప్లే స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా ఉండాలి. సీనియర్లు సాధారణంగా వారి ఫోన్‌లలో రెండు లేదా మూడు చర్యలను మాత్రమే చేస్తారు. వీటిలో కాల్ చేయడం, కాల్స్ స్వీకరించడం మరియు అలారాలు సెట్ చేయడం వంటివి ఉంటాయి. కాబట్టి వీరికి డిస్‌ప్లే స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా ఉండాలి.

ఫోన్ వేడెక్కడం

మనందరికీ తెలిసినట్లుగా ఫోన్ వేడెక్కడం వలన బ్యాటరీ కూడా పేలిపోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ కమ్యూనికేషన్ యూనిట్ మరియు కెమెరాను కూడా వేడిని కలిగిస్తాయి. అయితే ఇది బ్యాటరీ కంటే తక్కువ వేడిని కలిగి ఉంటాయి. ఫోన్‌ని వేడిగా ఉండడం వల్ల దాన్ని ఉపయోగించడం సవాలుగా ఉండటమే కాకుండా దాని పనితీరును కూడా పాడు చేస్తుంది. ఫోన్‌లో అధిక అప్లికేషన్‌లు, గేమ్‌లు లేదా ఇతర సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడంతో స్మార్ట్‌ఫోన్‌లు వేడెక్కకుండా నివారించవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి. మీ ఫోన్‌ను పూర్తిగా అనగా 100% ఛార్జ్ చేయడాన్ని మానుకోవాలి. ఫోన్‌లో 90 శాతం లేదా అంతకంటే తక్కువ బ్యాటరీని ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే ఫోన్ బ్యాటరీ 20 శాతం కంటే తక్కువగా ఉండనివ్వవద్దు. చాలా సార్లు ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది, మరియు చాలా తక్కువ పవర్ బ్యాటరీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు మీ ఫోన్‌ను రోజుకు 2-3 సార్లు ఛార్జ్ చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Plan to Buying New Smartphone For Grand Parents? Remember These Things

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X