ఆసియా మొదటి మహిళా వ్యోమగామి ' కల్పానా చావ్లా'

Posted By: Super

ఆసియా మొదటి మహిళా వ్యోమగామి ' కల్పానా చావ్లా'

 

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని ఈరోజు అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని తన ప్రతిభాపాఠవాలతో విశ్వవ్యాప్తం చేసి కనుమరుగైన కల్పనా చావ్లా, ఆసియాలోనే అంతరీక్ష యాత్ర చేసిన మొదటి మహిళా వ్యోమగామిగా గుర్తింపు పొందిన భారతీయ సంతతికి చెందిన కల్పానా చావ్లా జీవితం గురించి విశేషాలను పాఠకులకు తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. కల్పానా చావ్లా మార్చ్ 17, 1962న భారత దేశంలో హర్యానా లోని కర్నాల్ అనే ఊరులో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టారు. కల్పన అంటే సంస్కృతం లో అర్ధం "ఊహ".

కల్పనా చావ్లా కర్నాల్‌లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత తన ఉన్నత చదువులను 1982 లో ఈమె చండీగఢ్ లోఉన్న పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికాల్ ఇంజనీరింగ్ సైన్సు పట్టాను సంపాదించారు. 1982లో ఈమె అమెరికా వెళ్లి అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని, అర్లింగ్టన్ లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984 లో పొందారు.1986లో, చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డి ని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు.

ఆసియా మొదటి మహిళా వ్యోమగామి ' కల్పానా చావ్లా'

అదే సంవత్సరం నాసా ఏమ్స్ పరిశోదనా కేంద్రంలో 'ఓవర్ సెట్ మేతడ్స్ ఇంక్' కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఈమె సిఎఫ్‌డి పరిశోధన చేసారు. చావ్లా విమానాలకు, గ్లైడర్లు లకు, వ్యాపార విమానాలకు శిక్షణ ఇచ్చే సామర్ద్యాన్ని కలిగి ఉన్నారు. ఆమె దగ్గర యఫ్సిసి జారీ చేసే టెక్నికల్ క్లాసు అమెచూర్ రేడియో అనుమతి కాల్ సైన్ KD5ESI ఉంది. ఆమె 1983లో విమానయాన శిక్షకుడు, విమాన చోదక శాస్త్ర రచయిత అయిన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకున్నారు. దీంతో 1990 లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలి గా అయ్యారు.

ఆ తర్వాత 1995లో నాసా వ్యోమగామి కార్పస్ లో చేరారు. 1996లో మొదటి సారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికైయ్యారు. ఆమె మొదటి స్పేస్ ప్రయాణం 1997 నవంబర్ 19 న స్పేస్ షటిల్ కొలంబియా STS-87లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశం లో పుట్టి అంతరిక్షం లోకి ఏగిన తొలి మహిళ, భారత దేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండవ మనిషి. 1984 లో సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షయానం చేసిన వ్యోమోగామి రాకేశ్ శర్మాను అనుసరించారు.

చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటలకన్నా ఎక్కువ సేపు ప్రయాణం చేసారు. STS-87 సమయంలో, ఈమె తన భాద్యతను సద్వినియోగం చేస్తూ స్పార్టన్ ఉపగ్రహం వదలగా, అది పనిచేయకపోవటం వల్ల, విన్స్టన్ స్కాట్, తకౌ డొఇ తప్పని స్థితిలో అంతరిక్షం లో ఉపగ్రహాన్ని పట్టుకోవటానికి నడిచారు. నాసాలో ఐదు నెలల నాసా విచారణ తర్వాత, తప్పులు సాఫ్టవేర్ లో మరియు విమాన సభ్యులకి నిర్వచించిన పద్దతులు ఇంకా భూమి నుండి అదుపు చేయటం లోనే ఉన్నాయని, చావ్లా తప్పేమీ లేదని తేల్చి చెప్పింది.

ఆసియా మొదటి మహిళా వ్యోమగామి ' కల్పానా చావ్లా'

STS-87 ముగింపు పనులు పూర్తి అయిన తర్వాత, వ్యోమగాముల ఆఫీసులో చావ్లాను సాంకేతిక స్థానంలో నియమించారు. ఇక్కడ ఈమె పనిని గుర్తించి, సహుద్యోగులు ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారు. 2000లో STS-107 ఈమెను రెండవసారి అంతరిక్ష యానం చేయటానికి మిగిలిన సభ్యులతోపాటు ఎన్నుకున్నారు. ఈ క్షిపణి, నిర్ణీత కాలం నిశ్చయించటంలో విభేదాలు మరియు సాంకేతిక సమస్యలు, ఎలాంటివంటే 2002 లో గుర్తించిన నౌకా ఇంజనులో బీటలు వంటివాటివల్ల పలుమార్లు ఆలస్యం జరిగింది.

ఆసియా మొదటి మహిళా వ్యోమగామి ' కల్పానా చావ్లా'

2003 జనవరి 16, చివరగా చావ్లా తిరిగి కొలంబియా, విధివంచితమైన STS-107 క్షిపణిలో చేరారు. చావ్లా భాద్యతలలో SPACEHAB/BALLE-BALLE/FREESTAR మైక్రో గ్రావిటీ ప్రయోగాలు ఉన్నాయి, వీటి కోసం భూమీ ఇంకా అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి మరియు వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత మీద సభ్యులు 80 ప్రయోగాలు చేసారు.

ఇదే కొలంబియా అంతరిక్షనౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం ఏడుగురు వ్యోమగాముల్లో కల్పనా చావ్లా ఒకరు కావడం విషాదకరం. కొలంబియా వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో భూమికి 62 కి.మీ ఎత్తున ప్రయాణిస్తూ... మరో 16 నిముషాల కాలంలో కేప్‌ కెనవరాల్‌లోని కెనడీ అంతరీక్ష కేంద్రంలో దిగాల్సి ఉన్న తరుణంలో ప్రమాదానికి గురైంది. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కొలంబియాలో ప్రయాణిస్తున్న కల్పనా చావ్లా (మిషన్‌ స్పెషలిస్టు) సహా మరో ఆరుగురు వ్యోమగాములు హజ్‌బెండ్‌ (కమాండర్‌), ఆండర్సన్‌ (పేలోడ్‌ కమాండర్‌), మెక్‌కూల్‌ (పైలట్‌), ఇలాన్‌ రామన్‌ (పేలోడ్‌ స్పెషలిస్టు), బ్రౌన్‌, క్లార్క్‌ (మిషన్‌ స్పెషలిస్టులు) ప్రాణాలు కోల్పోయారు.

ఆసియా మొదటి మహిళా వ్యోమగామి ' కల్పానా చావ్లా'

ప్రమాద సమయంలో గంటకు 20 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక విస్ఫోటనానికి గురై పేలిపోగా దాని శకలాలు టెక్సాస్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఆ శకలాలు విషపూరిత రసాయనాలతో కూడినవి అయి ఉన్నందున పౌరులెవరూ వాటి చాయలకూ పోరాదని నాసా హెచ్చరించింది. కాగా... 40 ఏళ్లకు పైబడిన నాసా చరిత్రలో మానవ వ్యోమనౌక భూమికి తిరిగివస్తూ ఆపదకు గురికావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

కల్పనా చావ్లా మరణాంతరం ఆమె జ్ఞాపకార్ధం 2003 ఫిబ్రవరి 5న, భారతదేశ ప్రధానమంత్రి వాతావరణ క్రమం తెలిపే గ్రహాలు, METSAT కు కల్పనా అని పేరుమార్చి పెట్టారు. న్యూయార్క్ సిటీ లోని క్వీన్స్ ప్రాంతం లో 74 జాక్సన్ హైట్స్ వీధిని ఇప్పుడు ఆమె గౌరవార్ధమ్ 74 వ కల్పనా చావ్లా వీధి మార్గం అనిపేరు పెట్టారు. నాసా ఒక సూపర్ కంప్యూటర్ ని కల్పనా కి అంకిత మిచ్చింది. ప్రఖ్యాత నవలారచయిత 2007వ సంవత్సరంలో పీటర్ డేవిడ్ తన నవల స్టార్ ట్రెక్ లో ఒక వ్యొమనౌకకు చావ్లా అని పేరు పెట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ , ఖరగ్‌పూర్ వారు ఆమె గౌరవార్ధం కల్పనా చావ్లా స్పేస్ టెక్నాలజీ సెల్‌ను ఆరంభించారు.

Courtesy By: వీకీపీడియా

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot