ఆన్‌లైన్ Apps లో లోన్ తీసుకుంటున్నారా.. మీ డేటా ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే!

|

నేటి కాలంలో లోన్ (రుణం) తీసుకోవ‌డం చాలా సులువు. ఆన్‌లైన్ వేదిక‌గా చాలా Apps విచ్చ‌ల‌విడిగా త‌క్ష‌ణ లోన్లు మంజూరు చేస్తున్నాయి. కేవ‌లం ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్ యాప్స్‌లో Loan స‌దుపాయం పొందే అవ‌కాశం ఉంది. కానీ, ఈ Loan యాప్స్‌ స‌దుపాయం మీ జీవితాల్ని న‌ర‌క‌ప్రాయంగా మార్చే అవ‌కాశాల్ని కూడా మెండుగా క‌లిగి ఉంది.

 
ఆన్‌లైన్ Apps లో లోన్ తీసుకుంటున్నారా.. మీ డేటా ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే!

ఇటీవ‌ల మేం ఫేస్‌బుక్ వేదిక‌గా కొన్ని త‌క్ష‌ణ Loan స‌దుపాయం క‌ల్పించే యాప్‌ల‌కు సంబంధించిన‌ యాడ్ల‌ను గ‌మ‌నించాం. మొద‌ట్లో ఈ Apps చాలా ఆక‌ర్ష‌ణీయంగా త‌క్కువ వ‌డ్డీ రేటు క‌ల్పిస్తున్న‌ట్లు న‌మ్మ‌కంగా క‌నిపిస్తాయి. కానీ, వాస్త‌వానికి ఆ యాప్స్ 36శాతం వ‌డ్డీ రేటు విధిస్తాయి. అంతేకాకుండా ఈ త‌ర‌హా యాప్స్ నుంచి చాలా ప్ర‌మాదం పొంచి ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గ‌మ‌నించాలి. అందుకు సంబంధించి ఇక్కడ మేం కొన్ని సూచ‌న‌ల‌ను అందిస్తున్నాం.

అదీ ఇదీ అని కాకుండా.. మొబైల్‌లో ఉన్న డేటా అంతా స్వాహా!
ఈ త‌రహా లోన్ అప్లికేష‌న్లు యూజ‌ర్ల వ్య‌క్తిగ‌త డేటాను ఎక్కువ‌గా సేక‌రిస్తాయి. అదీ ఇదీ అని కాకుండా మీ మొబైల్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఆ యాప్స్ సేక‌రిస్తాయి. ఈ ప్ర‌మాదం ఐఫోన్ల‌లో కంటే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ‌ర్ల‌కు ఎక్కువ‌గా పొంచి ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ డేటా సేకరణలో భాగంగా మీ ఖచ్చితమైన లొకేష‌న్ మరియు పేరు, ఇమెయిల్ చిరునామా, వినియోగదారు ID, ఫోన్ నంబర్ మరియు ఇతర సమాచారంతో సహా వ్యక్తిగత సమాచారాన్ని సేక‌రిస్తుంది. మ‌రో కీల‌క విష‌యం ఏంటేంటే.. కేవ‌లం పైన చెప్పుకున్న డేటా మాత్ర‌మే కాకుండా, ఈ యాప్‌లలో యూజ‌ర్ల‌కు సంబంధించిన మెసేజ్ డేటా, ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లు, డాక్యుమెంట్‌లు, కాంటాక్ట్‌లు, యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం మరియు డివైజ్ IDలను కూడా అవి సేక‌రిస్తాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే, ఈ యాప్‌లు మీ ఫోన్‌ని క్లోన్ చేస్తాయి మరియు మీ వ్యక్తిగత డేటా మొత్తాన్ని క్లౌడ్‌లో నిల్వ చేస్తాయి.

క‌నీసం ఆ యాప్ల‌ను ఇన్‌స్టాల్ కూడా చేయ‌వ‌ద్దు:
ఫేస్‌బుక్ లేదా ఏదైనా ఇత‌ర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల‌లో మీకు లోన్ ఇచ్చే యాప్‌ల‌కు సంబంధించినవి క‌నిపిస్తే వాటిని క్లిక్ చేయ‌కండి. అస‌లు అలాంటి యాప్స్‌ను మీ మొబైల్స్ ఇన్‌స్టాల్ కూడా చేసుకోకండి. ఈ యాప్స్ భూతాల మాదిరి మీ డేటాను త‌స్క‌రించి త‌ప్పు మార్గంలో వినియోగించుకుంటాయి. మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసిన వెంట‌నే మీ డేటాను అవి తీసుకుంటాయి. మీ మొబైల్స్‌లో ఏదైనా సున్నిత మైన డేటా ఉంటే వాటిని మీకు బాధ క‌లిగించే రీతిలో ఉప‌యోగించే అవ‌కాశం ఉంటుంది.

ఆన్‌లైన్ Apps లో లోన్ తీసుకుంటున్నారా.. మీ డేటా ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే!

గూగుల్ ప్లే స్టోర్ వాటికి లొసుగుల‌ను క‌నుగొని వాటి ద్వారా డేటాను సేక‌రిస్తున్నట్లు తెలుస్తోంది. చదువుకున్న వ్యక్తులు ఇలాంటి యాప్స్‌కు యాక్సెస్ ఇచ్చే క్ర‌మంలో వాటి తీరును గుర్తించే ఆస్కారం ఉంటుంది. కానీ, త‌క్ష‌ణ రుణ స‌దుపాయం కోరుకునే చాలా మంది వినియోగదారులు అన్ని హెచ్చరికలను విస్మరించి, వారి డివైజ్‌ నుండి అవసరమైన డేటాను సేకరించడానికి యాప్‌కు అవసరమైన అనుమ‌తులు ఇస్తున్నారు. అలా ఆ యాప్స్‌కు మీ డేటాపై యాక్సెస్ ఇచ్చిన త‌ర్వాత.. మీరు లోన్ రీపేమెంట్ చేయ‌డంలో విఫ‌ల‌మైతే ఆ యాప్స్ మీ డేటాను మిస్ యూజ్ చేసే ముప్పు ఉంటుంది. యూజ‌ర్ల‌ ఫొటోలు, లేదా వీడియోల‌ను మార్ఫింగ్ చేయ‌వ‌చ్చు, లేదా మీ కాంటాక్ట్స్‌కు స్పామ్ కాల్స్ చేయ‌వ‌చ్చు. త‌ద్వారా యూజ‌ర్లు ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ కంప్లైంట్‌ పోర్ట‌ల్స్‌ లో ఈ త‌ర‌హా మోసాల‌పై ఫిర్యాదులు ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

 

కేవ‌లం RBI రిజిస్ట్రేష‌న్ క‌లిగిన సంస్థ‌ల నుంచే రుణాలు తీసుకోవ‌డం మేలు:
లోన్ కావాలా? మీ బ్యాంక్ లేదా ఏదైనా ఇతర RBI-నమోదిత ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవ‌డం చాలా ఉత్తమం. ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి లోన్‌లు పొందడం వలన కొంత పని ఉంటుంది, కానీ, వ్య‌క్తిగ‌త డేటాకు ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌దు.

Best Mobiles in India

English summary
Planning To Take A Loan Via An App? Your Data Might Be At Risk

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X