ప్లాస్టిక్ ఆధార్ కార్డ్స్ చెల్లవు, వాటిని తీసుకోకండి

Posted By: BOMMU SIVANJANEYULU

మార్కెట్లో లభ్యమవుతోన్న ప్లాస్టిక్ లేదా పీవీసీ స్మార్ట్ ఆధార్ కార్డ్స్‌ను తీసుకోవద్దని, వీటి వల్ల ఏమాత్రం ఉపయోగంలేదని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

ప్లాస్టిక్ ఆధార్ కార్డ్స్ చెల్లవు, వాటిని తీసుకోకండి

ఈ అనధికారిక ముద్రణ వల్ల యూజర్ వ్యక్తిగత డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని యూఐడిఏఐ సీఈఓ అజయ్ భూషన్ పాండే హెచ్చరించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌కార్డ్‌లకు దూరంగా ఉండండి..

ఆధార్ కార్డ్ అనేది సాధారణ పేపరు మీద ముద్రించా ఉన్నా చెల్లుబాటు అవుతుందని, దీనికి ఎటువంటి లామినేషన్స్ లేదా స్మార్ట్ కార్డ్ హంగులు అవసరం లేదని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ కాన్సెప్ట్‌ను తాము ఎంత మాత్రం ప్రోత్సహించటం లేదని ఇటువంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన తెలిపారు.

రూ.50 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు..

కొన్ని దుకాణాల్లో ఆధార్ పీవీసీ స్మార్ట్‌కార్డ్స్ నిమిత్తం రూ.50 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. వీరి ఉచ్చులో ఇరుక్కుని డబ్బులు పోగొట్టుకోవద్దని ఆయన తెలిపారు. ఒకవేళ ఆధార్ పోగొట్టుకునట్లయితే ఆధార్ అఫీషియల్ సైట్‌లోకి వెళ్లి కొత్త ఆధార్‌ను తీసుకోవచ్చని ఆయన తెలిపారు.

ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

సాధారణంగా ఆధార్ కార్డుకు ధరఖాస్తు చేసుకున్న వారికి, వారి ఆధార్ కార్డ్ పోస్ట్ ద్వారా పంపబడుతుంది. కొంత మందికి పోస్ట్‌లో రావటం ఆలస్యమవుతుంది. ఇలాంటి సందర్బాల్లో ఆధార్ కార్డ్‌ను నేరుగా ఆన్‌లైన్ నుంచే డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంటర్నెట్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు పలు సలువైన మార్గాలను ఇక్కడ సూచించటం జరుగుతోంది..

నిజమెంత,రూ. 60కే నెలంతా అపరిమిత డేటా, రూ. 500కే 4జీ స్మార్ట్‌ఫోన్ !

ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఏం కావాలి..?

ఇంటర్నెట్ ద్వారా ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు.. మీ ఆధార్‌కు సంబంధించిన Enrollment ID.ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowldgement form పై ఈ ఐడీ ఉంటుంది. అలానే మీ పేరు, యారియా పిన్‌కోడ్, ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీరిచ్చిన మొబైల్ నెంబర్.

UIDAI అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి

ముందుగా ఆధార్‌కు సంబంధించిన అధికారిక వైబ్‌సైట్ UIDAIలోకి లాగిన్ అవ్వండి.(వెబ్‌సైట్ లింక్ https://eaadhaar.uidai.gov.in/) లింక్ ఓపెన్ అయిన తరువాత మీకు స్కీన్ పై బాగంలో Aadhaar No (UID), Enrolement No (EID) పేర్లతో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Enrolement No (EID)ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 1..

ఆధార్ రిజిస్ట్రేషన్ సందర్భంగా మీకిచ్చిన Acknowldgement form పై ఉన్న విధంగా Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ), Area Pin Code, Capcha text ఇంకా మొబైల్ నెంబర్‌ను సంబంధిన కాలమ్‌లలో ఎంటర్ చేయండి.

స్టెప్ 2...

వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని Get One Time Password పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ మెసేజ్ రూపంలో అందుతుంది. PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది, Area Pin Code ఎంటర్ చేస్తే చాలు. మీ ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Plastic Aadhaar cards not valid, UIDAI says people should not print them
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot