బిట్‌కాయిన్స్ వ్యాపారం కోసం కొత్త యాప్ వచ్చేసింది

Posted By: BOMMU SIVANJANEYULU

గతకొద్ది వారాలుగా బిట్ కాయిన్ విలువ అంచనాలకు అందని రీతిలో పెరిగిపోతోంది. డిజిటల్ కరెన్సీలో ఇదో పెద్ద విప్లవంగా మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ. ఈ కరెన్సీని ఆన్‌లైన్ వాలెట్‌లో నిల్వ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకమైన డిజటిల్ కాయిన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉంటాయి.

బిట్‌కాయిన్స్ వ్యాపారం కోసం కొత్త యాప్ వచ్చేసింది

ప్రపంచదేశాలతో పాటు భారత్‌లోనూ బిట్‌కాయిన్ ఫీవర్ విస్తరిస్తోన్న నేపథ్యంలో దుబాయ్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ డీలర్ ప్లూటో ఎక్స్‌ఛేంజ్ భారతదేశపు మొట్టమొదటి బిట్‌కాయిన్ ట్ర్రేడింగ్ అప్లికేషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ యాప్ ఆధారిత్ వాలెట్ ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్‌లను ఉపయోగించుకుని

బిట్‌కాయిన్ లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది.

బిట్‌కాయిన్స్ వ్యాపారం కోసం కొత్త యాప్ వచ్చేసింది

ఈ పిన్ సెక్యూర్డ్ అప్లికేషన్ ద్వారా బిట్‌కాయిన్ టు బిట్‌కాయిన్ అడ్రస్‌కు కాకుండా మొబైల్ నెంబర్ టు మొబైల్ నెంబర్ అడ్రస్‌లకు లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది. ఐఏఎన్ఎస్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం 4 డిజిట్ల పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పిన్ ఆధారంగా ఈ బిట్ కాయిన్ లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది.

స్పీడ్‌లో దుమ్మురేపుతున్న జియో, పోటీ రేసులో ఐడియా !

ఈ మల్టీపర్పస్ యాప్ ద్వారా వివిధ రకాల పేమెంట్లతో పాటు రెమిటెన్సెస్, బిజినెస్ టు బిజినెస్ కామర్స్, సప్లై చెయిన్ ఫైనాన్స్, అసెట్ మేనేజ్‌మెంట్, ట్రేడింగ్ వంటి లావాదేవీలను నిర్వహించుకునే వీలుంటుంది.

English summary
Pluto Exchange is India’s first Bitcoin trading app-based wallet to enable mobile transactions. The app-based wallet enables bitcoin transactions using a mobile number which makes it quite handy for smartphone users
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot