Home
News

AI ఉద్యోగాలను పోగొడుతుందా.. పారిస్ సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు..

PM Modi: పారిస్‌లో జరిగిన AI సదస్సులో మోదీ కీలక ప్రసంగం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మోదీ మాట్లాడారు. AI పరిశ్రమలను, ఉద్యోగాలను, ప్రపంచ విధానాలను ఎలా మార్చేస్తుందో ఆయన వివరించారు. ఉద్యోగాలు పోతాయని భయపడకుండా, మార్పులకు అనుగుణంగా మారడంపై దృష్టి పెట్టాలని సూచించారు. AI మానవాళికి మేలు చేసేలా, నష్టాలను తగ్గించేలా ప్రపంచమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

* AI దూకుడుకు గ్లోబల్ రూల్స్ తప్పనిసరి..

మోదీ మాట్లాడుతూ, AI గతంలో వచ్చిన టెక్నాలజీల కంటే చాలా వేగంగా దూసుకుపోతోందని అన్నారు. అందుకే దీనికి పక్కా రూల్స్ ఉండాలని తేల్చి చెప్పారు. సరైన నిబంధనలు లేకపోతే AIని తప్పుగా వాడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది జరగకుండా ఉండాలంటే, దేశాలన్నీ కలిసి బాధ్యతాయుతమైన AI గైడ్‌లైన్స్ రూపొందించాలని కోరారు.

PM Modi Drops Truth Bomb at Paris AI Summit  AI Will Transform Jobs  Not Destroy Them

ఈ రూల్స్ AIని మంచి కోసమే వాడేలా చూడాలి, చెడుకు కాదు అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ సలహా చాలామందికి నచ్చింది దీనిని చాలామంది ఆహ్వానిస్తున్నారు. ఈ రూల్స్ వల్ల ఎవరికి ఏ హాని జరగదని చెప్పుకోవచ్చు.

* ఉద్యోగాలు పోయేది లేదు.. జస్ట్ మారతాయి..

AI ఉద్యోగాలను లాగేసుకుంటుందని చాలామంది భయపడుతున్నారు. కానీ మోదీ ఈ భయాన్ని కొట్టిపారేశారు. టెక్నాలజీ ఎప్పుడూ పనులను తీసేయలేదని, జస్ట్ వాటి రూపు మారుస్తుందని చెప్పారు. "టెక్నాలజీ వల్ల పని పోదు, దాని స్వభావం మారుతుంది. కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి" అని మోదీ అన్నారు.

AI యుగంలో నిలబడాలంటే ప్రజలు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఉన్న స్కిల్స్‌ను అప్‌డేట్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టాలని సూచించారు. మోదీ AI తెచ్చే పెద్ద చిక్కులను కూడా ప్రస్తావించారు. AI అల్గారిథమ్‌లలో పక్షపాతం ఉండొద్దు, AI తీసుకునే నిర్ణయాలు నిష్పక్షపాతంగా ఉండాలి. తప్పుడు తీర్పులు రాకుండా ఉండాలంటే మంచి డేటా వాడాలని చెప్పారు.

సైబర్ నేరగాళ్లు AI సాయంతో డేంజరస్ దాడులు చేయొచ్చు. దీన్ని ఆపడానికి కఠినమైన రూల్స్ కావాలి. AI ఫేక్ న్యూస్‌ను క్షణాల్లో వైరల్ చేస్తుంది. స్ట్రాంగ్ డిజిటల్ సెక్యూరిటీ చర్యలు తీసుకోవాలి. డీప్‌ఫేక్స్ & తప్పుడు సమాచారాన్ని అరికట్టాలని మోదీ పిలుపునిచ్చారు.

AIకి భారీ కంప్యూటింగ్ పవర్ కావాలి, దీనివల్ల కరెంటు వాడకం పెరుగుతుంది. AI వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి గ్రీన్ ఎనర్జీ వాడాలని మోదీ సలహా ఇచ్చారు. ఇన్ని సవాళ్లు ఉన్నాయని ఇప్పటిదాకా చాలామందికి తెలియదు. వీటిని మనుషులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

* ఇండియా AI విజన్

మోదీ ఇండియా AI ప్లాన్స్‌ను షేర్ చేసుకున్నారు. AIని హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం వంటి నిజమైన సమస్యలను పరిష్కరించడానికి వాడాలని చెప్పారు. ఇండియా AIని అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని అనుకుంటోంది, పెద్ద కంపెనీలకు మాత్రమే కాదు అని స్పష్టం చేశారు.

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది గ్రీన్ ఫ్యూచర్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీతో AI ఎలా కలిసి పనిచేస్తుందో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని తెలిపారు. చివరిగా మోదీ ఇండియా సాధించిన డిజిటల్ ప్రగతిని గురించి చెప్పారు. ఇండియా తక్కువ ఖర్చుతో 140 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే స్ట్రాంగ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను నిర్మించిందని గుర్తుచేశారు.

ఇతర దేశాలు కూడా బాధ్యతాయుతంగా AIని డెవలప్ చేయడానికి ఈ మోడల్‌ను ఫాలో అవ్వొచ్చని సూచించారు. మోదీ AI గురించి క్లియర్ అండ్ బ్యాలెన్స్‌డ్ వ్యూ ఇచ్చారు. AI వల్ల కలిగే లాభాలను ఆహ్వానిస్తూనే, అది నీతిగా, అందరికీ అందుబాటులో ఉండేలా, పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలంటే ప్రపంచ సహకారం అవసరమని నొక్కి చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Modi at Paris AI Summit: AI will reshape jobs, not destroy them, requiring global rules and upskilling. He highlighted AI's potential for good, India's digital model, and challenges like bias and security.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X