Home
News

Modi On Digital Arrest డిజిటల్‌ అరెస్ట్‌పై 'మన్‌ కీ బాత్‌' లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..!!

డిజిటల్‌ అరెస్ట్‌.. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సైబర్‌ నేరగాళ్లు.. ప్రభుత్వ అధికారుల పేరు చెప్పి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసి డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. కొన్నిసార్లు డిజిటల్‌ అరెస్ట్‌ (Digital Arrest) పేరు చెప్పి కొన్ని గంటలపాటు వీడియో కాల్స్‌ లేదా ఆన్‌లైనో ఉండాలని సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి.

డిజిటల్‌ అరెస్ట్‌లపై ప్రధాని మోడీ (Modi on Digital Arrest) స్పందించారు. మన్‌ కీ బాత్‌ (Mann ki Batt) కార్యక్రమంలో ఈ ఘటనలపై స్పందించారు. ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచనలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరూ డిజిటల్ అరెస్ట్‌ పేరుతో వేదించరని గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రాల సాయంతో దర్యాప్తు సంస్థలు ఈ తరహా ఘటనలు కట్టడికి కృషిచేస్తున్నాయని చెప్పారు.

Prime minister modi addressed on digital arrest fraud

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఈ తరహా ఘటనలు ఎలా జరుగుతాయే తెలిపేలా వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో ద్వారా ఈ తరహా సైబర్‌ నేరాల పట్ల ప్రజలకు అహగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ అధికారులు, సంస్థలు ఎప్పుడూ కూడా ప్రజలను డబ్బుల కోసం డిమాండ్ చేయవని స్పష్టం చేశారు. డిజిటల్‌ అరెస్ట్ పేరుతో ప్రజలకు ఎటువంటి ఫోన్‌లు వచ్చినా ఆందోళన చెందకుండా ఉండాలని సూచించారు.

ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలో కొన్ని సూచనలు చేశారు. "ఆగండి.. ఆలోచించండి.. ఆపై స్పందించండి" అంటూ కొన్ని టిప్స్‌ చెప్పారు. మరియు ఇలాంటి సమయాల్లో నేరగాళ్ల ఫోన్‌ కాల్‌ రికార్డు చేయడం లేదా వాళ్ల ఫోటోలను స్క్రీన్‌ షాట్‌ తీసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. దీంతోపాటు సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 కి సమాచారం అందించాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌ ఈ తరహా ఘటనలపై ఫిర్యాదు చేయాలని ప్రధాని మోడీ సూచించారు.

డిజిటల్‌ అరెస్ట్ ఘటనలపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, ఈ తరహా ఘటనలకు పాల్పడిన వీడియో కాలింగ్‌ ఐడీలు, సిమ్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్‌లను బ్లాక్ చేసినట్లు చెప్పారు. డిజిటల్‌ అరెస్ట్‌ అనేది చట్టాల్లో లేదని.. ఇది ప్రజలను మోసం చేసే ఎత్తుగడని ప్రధాని స్పష్టం చేశారు. దీనిపై ఇతరులకు అవగాహన కల్పించాలని బాధితులకు మోడీ సూచించారు.

ఈ తరహా ఘటనలు ఎలా జరుగుతాయి..?
పోలీసులు, సీబీఐ సహా ఇతర ప్రభుత్వ సంస్థల అధికారులమంటూ ఫోన్‌లు చేసి తొలుత పరిచయం చేసుకుంటారు. అనంతరం వివిధ కేసుల పేరుతో మిమ్మల్ని భయపెడతారు. మీ నుంచే చాలా సమాచారం సేకరిస్తారు. అనంతరం తాము చెప్పినట్లు చేయాలంటూ వీడియో కాల్‌లోనే ఉండాలని స్పష్టం చేస్తారు. ఈ పరిస్థితిపై ఆలోచన చేసేందుకు లేదా ఇతరులకు చెప్పే అవకాశం కూడా ఇవ్వరు.

సైబర్ నేరగాళ్లు చెప్పింది చేసేంతవరకు మిమ్మల్ని వీడియో కాల్‌లోనే ఉండేలా భయపెడతారు. చేయకపోతే అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడతారు. ప్రస్తుతానికి డిజిటల్‌ అరెస్ట్‌ చేసినట్లు చెబుతారు. ఇలా లక్షల రూపాయలను దోచుకుంటున్నారు. ఈ ఘటనల్లో ప్రముఖులు సహా సామాన్యులు కూడా బాధితులుగా ఉన్నారని ప్రధాని తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
PM modi warns on digital arrest fraud on in mann ki batt program and key suggestions to people
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X