Just In
Don't Miss
- Finance
Gold price today: వారంలో రూ.1000 తగ్గిన బంగారం ధర
- News
చరిత్రలో నిలిచిపోయేలా మోడీ సభ: బండి సంజయ్, కేసీఆర్‌ను పట్టించుకోమంటూ ఫైర్
- Sports
Ranji Trophy : ఛాంపియన్ టీం మధ్యప్రదేశ్‌కు సీఎం శివరాజ్ సింగ్ గుడ్ న్యూస్.. బహిరంగంగా..!
- Movies
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్.. తమిళ నటుడు హ్యాండ్ ఇవ్వడంతో?
- Lifestyle
మామిడి పండ్లను తిన్న వెంటనే ఇవి తినడం శరీరానికి ప్రమాదకరం; వీటిని అస్సలు తినకండి
- Automobiles
వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో కొత్త లగ్జరీ కార్.. ఇదే: మీరూ చూడండి
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ!! ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరం
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇండియాలో మొదలయ్యాయి. ఈ ఈవెంట్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో అయన 5G కమర్షియల్ రోల్అవుట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5G టెస్ట్‌బెడ్‌ను నేడు ఇండియాలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 5G వేగవంతమైన ఇంటర్నెట్ను తీసుకురావడమే కాకుండా ఆర్థిక పురోగతికి మరియు లక్షలాది మందికి ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా వారికి మంచి ఉపాధిని అందిస్తుంది అని అన్నారు. వచ్చే దశాబ్దంలో 5G సాయంతో భారత ఆర్థిక వ్యవస్థ 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మోదీ చెప్పారు.

ఇండియాలో 5G రోల్అవుట్ను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం మరియు పరిశ్రమలు రెండు కూడా ఒకరికి ఒకరు సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. 5G రోల్ అవుట్ అందుబాటులోకి వచ్చిన తరువాత వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు మరియు మరిన్ని రంగాలకు మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం లభిస్తుంది. 5G సాయంతో అనేక సాంకేతికతలలో వారి ఉత్పత్తులు, పరిష్కారాలు మరియు నమూనాలను ధృవీకరించడానికి టెలికాం పరిశ్రమ ఈ రంగంలో ఉన్న స్టార్టప్‌లకు ఇది మద్దతు ఇస్తుంది.

5G టెస్ట్‌బెడ్ ప్రాజెక్ట్ ను రూ.220 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో IIT మద్రాస్, IIT ఢిల్లీ, IIT బాంబే, IIT హైదరాబాద్, IIT కాన్పూర్, IISc బెంగళూరు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ (CEWiT) మరియు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ & రీసెర్చ్ (SAMEER) వంటి ఎనిమిది ఇన్స్టిట్యూట్లు కలిసి అభివృద్ధి చేశాయి. 5G టెస్ట్‌బెడ్ భారతీయ పరిశ్రమలో స్టార్టప్‌లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. 5G కోసం స్పెక్ట్రమ్ వేలం యొక్క విధివిధానాలపై DoT (టెలికమ్యూనికేషన్స్ విభాగం) యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన DCC (డిజిటల్ కమ్యూనికేషన్స్ కమీషన్) నిర్ణయించే రోజున టెస్ట్‌బెడ్ ప్రారంభించబడుతుంది.

భారతదేశం 6G కోసం సిద్ధమవుతోందా
భారతదేశంలో 5G అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త తరం మార్పులలో భాగంగా తరువాత ఇండియా 6Gకి సిద్ధమవుతోందని మోడీ చెప్పారు. భారతదేశం 2G, 3G మరియు తదనంతర తరం నెట్వర్క్ టెక్నాలజీల నుండి సజావుగా ముందుకు సాగేలా TRAI చేస్తున్న ప్రయత్నాలను ఆయన గుర్తించారు. దేశంలో 5G నెట్‌వర్క్‌లను వేగంగా రోల్ అవుట్ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT)కి పంపిన లేఖ ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఆగస్టు 15, 2022 నాటికి 5G రోల్అవుట్ జరగాలని కోరుకుంటోంది.

ఇండియాలో 5G నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తీసుకొని రావాలంటే కనుక స్పెక్ట్రమ్ వేలం సకాలంలో జరగాలి. ఆ తరువాత DoT తప్పనిసరిగా వీలైనంత త్వరగా ఆపరేటర్లకు ఎయిర్‌వేవ్‌లను కేటాయించాలి. తద్వారా వారు 5G సేవలను సకాలంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొనిరావడం కోసం ప్రారంభించగలరు. భారతదేశంలో ఇంకా 5G గురించి పరిష్కరించాల్సిన కొన్ని ఆందోళనలు ఉన్నాయి.

స్పెక్ట్రమ్ ధరలపై ఈ వారంలో క్యాబినెట్ నుంచి తుది వివరణ వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్ ధర, వ్యవధి వంటి మరిన్ని విషయాలు క్యాబినెట్ ద్వారా పరిష్కరించబడతాయి. క్యాబినెట్ నుండి తుది నిర్ణయాలు వచ్చిన వెంటనే, స్పెక్ట్రమ్ వేలం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటీసు (NIA) విడుదల చేయడానికి DoT వెళుతుంది. ఇవి అన్ని కూడా సకాలంలో జరిగితే జులై 2022 నాటికి స్పెక్ట్రమ్ వేలం జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఆగస్టు 2022 నాటికి టెల్కోలు 5G సేవలను ప్రారంభించగలరా అనేది ఇప్పటికీ ప్రశ్నగా ఉంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999