జియోకు మేము అనుమతి ఇవ్వలేదు: కేంద్రప్రభుత్వం

మోడీ ఫోటోలను ఉపయోగించుటకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు

By Hazarath
|

రిలయన్స్ జియో ప్రకటనలు గమనించారా.. రిలయన్స్ జియో ప్రకటనలను మీరు పూర్తిగా గమనించినట్లయితే అందులో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు గోల గోల చేస్తున్నాయి. జియో ప్రకటనల్లో మోడీ ఫోటోలు వాడుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆ ఫోటోలతో మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.

అప్పడు రూ. 16 వేల కోట్లు, ఇప్పుడు రూ. 3 వేల కోట్లు అవుట్

 యాడ్స్‌లో నరేంద్ర మోడీ చిత్రాలు

యాడ్స్‌లో నరేంద్ర మోడీ చిత్రాలు

జియో ప్రకటనలపై వస్తున్న యాడ్స్‌లో నరేంద్ర మోడీ చిత్రాలు ఉపయోగించడానికి మేము అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రసారశాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాధోడ్ తెలిపారు.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి

సమాజ్ వాది పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జియో ఎలక్ట్రానిక్ యాడ్స్ లో మోడీ ఫోటోలను ఉపయోగించుటకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎటువంటి చర్యలు తీసుకుంటారో

ఎటువంటి చర్యలు తీసుకుంటారో

అయితే అనుమతి లేకుండా ప్రధాని ఫోటోలు వాడుకున్నందుకు జియోపై మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మాకు తెలపాలని డిమాండ్ చేయడంతో రాధోడ్ ఈ విషయంపై చిహ్నాలు మరియు పేర్లు (అసమాన వినియోగం నివారణ) చట్టం 1950 ప్రకారం కన్జ్యుమర్ అఫైర్స్, ఫూడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ సమాధానమిస్తుందని తెలిపారు

ప్రధాని ఫోటోలు వాడుకునేందుకు అనుమతి

ప్రధాని ఫోటోలు వాడుకునేందుకు అనుమతి

మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా యూనిట్, అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ డైరెక్టరేట్ (డీఏవీపీ), వివిధ మీడియా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు మాత్రమే ప్రధాని ఫోటోలు వాడుకునేందుకు అనుమతి ఇస్తుందని తెలిపారు.

వ్యాపార ప్రకటనల్లో

వ్యాపార ప్రకటనల్లో

కాగా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో ఇన్ ఫ్రాటెల్ వ్యాపార ప్రకటనల్లో మోదీ పోటోలు దర్శనమివ్వడంపై పలు విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
PMO did not grant permission to Reliance Jio to use Narendra Modi’s photo for its ads read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X