నెలాఖరులోగా మీ డెబిట్ కార్డ్ మార్చుకోండి, లేకపోతే..

సెక్యూరిటీ లోపం కారణంగానే వీటి స్థానంలో కొత్త వాటిని జారీ చేస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు...

|

Maestro డెబిట్ కార్డులను వినియోగించుకుంటోన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బి) ఖాతాదారులు కార్డ్ బ్లాకేజ్‌ను ఎదుర్కోనున్నారు. ఈ నెలాఖరులోగా వీరు తమ కార్డులను రీప్లేస్ చేసుకోని పక్షంలో వీరి కార్డులను బ్లాక్ చేయటం జరుగుతుంది. సెక్యూరిటీ లోపం కారణంగానే వీటి స్థానంలో కొత్త వాటిని జారీ చేస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. కొత్తగా ఇష్యూ చేసే డెబిట్ కార్డులలో మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయని అమర్చినట్లు తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం...

పాత కార్డులను ఇచ్చేసి కొత్త కార్డులను పొందే క్రమంలో ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇష్యూ చేసిన అన్ని Maestro డెబిట్ కార్డులను రిజర్వ్ బ్యాంక్ ఇండియా బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. జూలై 31, 2017 తరువాత ఇవి పనిచేయకుండా పోతాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా లక్ష వరకు Maestro డెబిట్ కార్డులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చవల్సి ఉంది. ఇప్పటికే ఆయా ఖతాదారులకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారాన్ని అందించినట్లు బ్యాంక్ అఫీషియల్ ఒకరు తెలిపారు.

మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?

మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?

నోట్ల రద్దు తరువాత డెబిట్/క్రెడిట్ లావాదేవీలు మరింత ఊపందుకున్నాయి. ఈ కార్డుల వినియోగం విషయంలో సరైన ప్రికాషన్స్ తీసుకోని పక్షంలో సైబర్ నేరాగాళ్లు ఉచ్చులో ఇరుక్కోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను దొంగిలించేందుకు సైబర్ నేరాగాళ్ల ముందున్న పలు మార్గాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది. వీటిని తెలుసుకోవటం ద్వారా, మీ కార్డు లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

సిమ్ క్లోనింగ్

సిమ్ క్లోనింగ్

కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.

స్కిమ్మింగ్..

స్కిమ్మింగ్..

కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.

కార్డ్ ట్రాపింగ్

కార్డ్ ట్రాపింగ్

కార్డ్ ట్రాపింగ్ అనేది ఒక చిల్లు లాంటిది. మీరు మెచీన్‌లో కార్డు పెట్టగానే హ్యాకర్లు ఏర్పాటు చేసిన చిల్లులోకి వెళ్లిపోతుంది. తద్వారా మీ కార్డుకు సంబంధించిన సమచారాన్ని దొంగిలించటం జరుగుతుంది.

షోల్డర్ సర్ఫింగ్..

షోల్డర్ సర్ఫింగ్..

మీరు ఏటీఎమ్ సెంటర్లలో నగదు విత్ డ్రా చేస్తున్నప్పుడు కొంత మంది, మీ వెనకే నిలుచొని మీరు ఎంటర్ చేస్తున్న పిన్ నెంబర్లను గమనిస్తుంటారు. ఇలా చేయటం వల్ల మీ పిన్ నెంబర్ వాళ్లకు తెలిసిపోయే అవకాశం ముంది. మీ కార్డను దొంగలిచి సలువుగా నగదు విత్‌డ్రా చేసుకోగలుగుతారు.

నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో..

నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో..

కొంత మంది తమకున్న మతిమరుపు కారణంగా నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో తమ డెబిట్ కార్డ్‌లను ATM kioskలో ఉంచి మరిచిపోతుంటారు. ఇలాంటి సమయంలో మీ కార్డుకు సంబంధించి దొంగిలించబడతుంది.

వివిధ ప్రయత్నాలు..

వివిధ ప్రయత్నాలు..

క్రెడిట్ కార్డులకు సంబంధించి వివరాలను రాబట్టే క్రమంలో హ్యాకర్లు వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా చాలాసార్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమయంలో హ్యాకర్లు ఊహాజనితంగా ఒక క్రమపద్ధతిలో నంబర్లను సృష్టిస్తుంటారు. వీళ్లు ఊహించే నెంబర్లు మీ కార్డ్ పై ఉన్నట్లయితే చిక్కలు తప్పవు.

ఫార్మింగ్..

ఫార్మింగ్..

కొందరు హ్యాకర్లు వాస్తవ వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి మిమ్మల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారు. ఒరిజినల్ వెబ్‌సైట్‌కు, డూప్లికేట్ వెబ్‌సైట్‌కు మధ్య తేడాలను మీరు గుర్తించలేకపోయినట్లయితే తప్పకుండా డెబిట్/క్రెడిట్ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.

కీ‌స్టోక్

కీ‌స్టోక్

హ్యాకర్లు కొన్ని మోసపూరిత సాఫ్ట్‌వేర్‌లను సృష్టించి వాటిని మీ డివైస్‌ల్లోకి జొప్పిస్తుంటారు. వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవటం వల్ల, మీకు తెలియకుండానే మీ క్రెడిట్ కార్డ్ అలానే నెట్ బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్లు గుప్పెట్లోకి వెళ్లిపోతాయి.

పబ్లిక్ వై-పై...

పబ్లిక్ వై-పై...

పబ్లిక్ వై-పై కొంత మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వై-ఫై హాట్ స్పాట్‌ల వద్ద మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకంటుంటారు. ఇటువంటి ప్రదేశాల్లోనే, మీ డేటా కోసం హ్యాకర్లు కాచుకుని కూర్చొని ఉంటారు.

స్వైపింగ్ మెచీన్ ఫ్రాడ్

స్వైపింగ్ మెచీన్ ఫ్రాడ్

స్వైపింగ్ మెచీన్‌‍లకు సంబంధించి కార్డ్ రీడర్ స్లాట్‌కు అటాచ్ చేసే డేటా స్కిమ్మింగ్ డివైస్ ద్వారా, మీ కార్డుకు సంబంధించిన సమచారాన్ని దొంగిలించే అవకాశం కూడా ఉంది.

మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్..

మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్..

మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్, స్కేర్‌వేర్, స్పైవేర్ వంటి ప్రమాదకర వైరస్‌లను మీ డివైస్ ల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా మీ డెబిట్/క్రెడిట్ కార్డుకు సమాచారాన్ని దొంగిలించవచ్చు.

Best Mobiles in India

English summary
PNB customers beware, your debit cards may get blocked soon. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X