పోకో ఫోన్లకు కూడా MIUI 14 అప్డేట్ ప్రకటించారు! ఫోన్ల లిస్ట్ చూడండి.
షియోమీ ఇటీవల అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల కోసం MIUI 14 అప్‌గ్రేడ్ కోసం అప్‌డేట్ టైమ్‌లైన్‌ను ప్రకటించింది. అలాగే ఇప్పుడు, కంపెనీ యొక్క సబ్ బ్రాండ్ అయిన పోకో ఫోన్లకు కూడా ఈ కొత్త అప్డేట్ ను భారతదేశంలో రోల్‌అవుట్ చేయడానికి టైమ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. కొన్ని పోక ఫోన్లకు ఇప్పటికే MIUI 14 ను అందించారు వీటిలో పోకో X5 ప్రో తో సహా 10 పోకో పరికరాలు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రూపొందించబడిన ఫోన్లను ఇప్పుడు ఈ తాజా అప్‌డేట్ తో ఆండ్రాయిడ్ 13 కి అప్‌గ్రేడ్ చేస్తుంది.షియోమీ 13 ప్రో గ్లోబల్ లాంచ్ సందర్భంగా షియోమీ ద్వారా MIUI 14 ప్రకటించబడింది. షియోమీ భారతదేశం కోసం తమ షియోమీ మరియు రెడ్ మీ ఫోన్ల కోసం కూడా ఈ అప్‌డేట్ టైమ్‌లైన్‌లను ప్రకటించింది.

పోకో MIUI 14 అప్‌డేట్ టైమ్‌లైన్‌ని ప్రకటించింది
ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేసే MIUI యొక్క తాజా వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను పోకో వెల్లడించింది. ఈ జాబితాలో రిలయన్స్ జియో యొక్క ట్రూ 5G నెట్‌వర్క్‌కు మద్దతుతో ఇప్పటికే MIUi 14 బీటా వెర్షన్‌లో ఉన్న ప్రముఖ పోకో F4 ఫోన్ కూడా ఉంది. ఈ స్థిరమైన అప్‌డేట్ ఏప్రిల్ మరియు జూన్ మధ్య ఎప్పుడైనా సూచించే Q2 2023 లో లాంచ్ చేయబడుతుంది భావిస్తున్నారు.
ఇప్పటికే ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 14పై రన్ అవుతున్న పోకో X5 ప్రో ఫోన్ కి Q1 2023లో తాజా వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేయబడుతుంది. అలాగే, Q2లో, పోకో F3 GT, పోకో X3 ప్రో , పోకో M5, పోకో M4 5G మరియు పోకో C55 వంటి పరికరాలు ఈ అప్‌డేట్‌లను అందుకుంటాయి. ఇంకా, Q3 2023లో, పోకో M4 ప్రో, పోకో X4 ప్రో 5G, పోకో M4 ప్రో 5G ఫోన్లు కూడా MIUI 14 అప్డేట్ ను పొందుతాయి.

MIUI 14 లో కొత్త ఫీచర్ల వివరాలు
MIUI 14 అప్డేట్ స్మార్ట్ ROM ఆప్టిమైజేషన్ వంటి కొత్త ఫీచర్లతో వస్తుంది. ఇది మీ కాష్ స్టోరేజ్‌ను బాగా తగ్గిస్తుంది. వేగవంతమైన బూట్ అప్ వేగం కోసం RAM ఆప్టిమైజేషన్ కూడా ఉంది మరియు RAM వినియోగాన్ని 11% తగ్గించింది. అలాగే,కాస్మెటిక్ మార్పులలో ఆరు కొత్త లైవ్ వాల్‌పేపర్‌లు, కార్డ్ స్టైల్ విడ్జెట్‌లు, కొత్త ఫ్లూయిడ్ యానిమేషన్‌లు మరియు మరిన్ని ఫీచర్లు ఈ అప్డేట్ లో ఉన్నాయి.
MIUI 14 ఒక ఇంటర్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా అందిస్తుంది, ఇది స్మార్ట్‌ఫోన్ మరియు టాబ్లెట్ ల మధ్య యాప్‌లను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, వేగవంతమైన ఫైల్ బదిలీలను అనుమతిస్తుంది.
ఈ అప్డేట్ యొక్క మరొక ఫీచర్ ఈ ఫోన్ లో ప్రైవసీ ని నిర్ధారిస్తుంది. ప్రసార సమయంలో డేటా లీకేజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సర్వర్‌ల ద్వారా రూట్ చేయకుండా పరికరాలకు నేరుగా అద్భుతమైన పనితీరును మరియు డేటా బదిలీ ఫీచర్ అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 12 సిస్టమ్ యాప్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








