Home
News

రూ.5,999 ధరకే 4GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. రేపటి నుంచే సేల్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Poco నుంచి అత్యంత తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. పోకో సంస్థ, భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యంతో Poco C51 4G స్మార్ట్‌ఫోన్ సేల్‌లోకి రానుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలుత ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ సిమ్‌ కార్డుతో లాక్‌ చేయబడుతుంది. ఫోన్‌ డెలివరీ అయిన 24 గంటల్లోగా సిమ్‌కార్డును అమర్చాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లు 10GB చొప్పున ఐదు కూపన్ల చొప్పున 50GB మొబైల్‌ డేటాను పొందుతారు.

Poco C51 smartphone

నాన్‌ ఎయిర్‌టెల్‌ కస్టమర్లు ఈ ప్రయోజనం పొందేందుకు ఇన్‌స్టంట్‌ యాక్టివేషన్‌ సదుపాయంతో ఎయిర్‌టెల్‌ సిమ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన 18 నెలల వరకు సిమ్‌ లాక్‌ చేయబడి ఉంటుంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్‌ మరియు 64GB అంతర్గత స్టోరేజీ స్మార్ట్‌ఫోన్‌ రూ.5,999కే అందుబాటులోకి రానుంది. మరియు రేపటి నుంచి (జులై 18) ఫ్లిప్‌కార్టులో కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.

పోకో C52 4G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G36 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీ సామర్యంతో వస్తుంది. ఈ ఫోన్‌ 7GB టర్బో ర్యామ్‌ (4GB LPDDR4X +3GB టర్బో ర్యామ్‌) సౌకర్యంతో వస్తుంది. ఫలితంగా మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.52 అంగుళాల డిస్‌ప్లే సహా 60Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. లెథర్‌ తరహా డిజైన్లతో వస్తుంది.

పోకో C51 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 గో క్లీన్‌ UI ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన కస్టమర్లు రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు పొందుతారని పోకో సంస్థ వెల్లడించింది. C51 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 8MP డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. f/2.0 అపేచర్‌తో వస్తుంది. ముందువైపు 5MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ప్లాష్‌లైట్‌తో వస్తుంది. దీంతోపాటు వెనుకవైపు ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ భాగస్వా్మ్యంతో Poco C52 4G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయడం సంతోషంగా ఉందని పోకో ఇండియా హెడ్‌ హిమాన్షు టాండన్‌ తెలిపారు. ఈ ఫోన్‌ కొనుగోలు చేసినవారు ఎయిర్‌టెల్‌ విస్తృతమైన నెట్‌వర్క్, పోకో ఆధునిక టెక్నాలజీ రెండు ప్రయోజనాలు పొందుతారని చెప్పారు.

పోకో, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థల భాగస్వా్మ్యం వినియోగదారులకు మేలు చేకూర్చే అవకాశం ఉంది. అధిక నాణ్యమైన, తక్కువ ధర ఫోన్ల పరిధిని విస్తరించే అవకాశం ఉంది. పోకో స్మార్ట్‌ఫోన్‌ ధర, ఎయిర్‌టెల్‌ సేవలతో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో పోకో C51 బలమైన ముద్ర వేసే అవకాశం ఉంది.

* జులై 15 నుంచి ఫ్లిప్‌కార్టులో బిగ్‌ సేవింగ్ డేస్‌ పేరిట సేల్‌ ప్రారంభం అయింది. ఈ సేల్‌ 19 వరకు కొనసాగనుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్, టీవీలు, గ్యాడ్జెట్లు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. వీటితో పాటు కొన్ని బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్టులతో ప్రత్యేక డిస్కౌంట్‌ ఇస్తున్నారు.

ఈ సేల్‌లో ఐఫోన్‌ 14 ప్లస్‌ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. .128GB స్టోరేజీ బేస్‌ మోడల్‌ అసలు ధర రూ.89,990గా ఉంది. ఈ ఫోన్‌ రూ.73,999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే 256GB వేరియంట్‌ ధర రూ.83,999కు అందుబాటులో ఉంది. అలాగే 512GB వేరియంట్‌ రూ.1,03,999కు సొంతం చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco C51 smartphone will be available to rs 5999 in flipkart big saving days sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X