Home
News

Flipkart లో పోకో డేస్ సేల్ ! పోకో ఫోన్‌ల మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్...

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి నుంచి విడిపోయిన తరువాత పోకో బ్యాండ్ తమ యొక్క అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లతో ఇండియాలో మంచి మార్కిట్ ను రూపొందించుకున్నది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో పోకో డేస్ సేల్ ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పోకో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల మీద ఎప్పుడు లేనన్ని గొప్ప తగ్గింపులను అందిస్తున్నది. 2020 సంవత్సరం ఆఖరి నెలలో ఫ్లిప్‌కార్ట్ లో జరుగుతున్న ఈ అమ్మకాలలో పోకో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరల వద్ద కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్ పోకో డేస్ సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ పోకో డేస్ సేల్ డిస్కౌంట్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ లో పోకో డేస్ యొక్క సేల్ నేటి నుంచి అంటే డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ మూడు రోజుల అమ్మకంలో భాగంగా పోకో యొక్క అన్ని స్మార్ట్‌ఫోన్‌ల మీద తగ్గింపు ధరలు లభిస్తున్నాయి. ఈ అమ్మకంలో పోకో X3 యొక్క 6GB ర్యామ్ వేరియంట్ ను రూ.15,999 ధర వద్ద పోకో C3 యొక్క 4GB ర్యామ్ వేరియంట్ ను రూ.6,999 ధర వద్ద, పోకో M2 యొక్క 6GB ర్యామ్ వేరియంట్ ను రూ.9,999 ధర వద్ద మరియు పోకో M2 ప్రో వేరియంట్ రూ.12,999 ధర వద్ద చివరిగా పోకో X2 యొక్క 8GB ర్యామ్ వేరియంట్ ను రూ.17,499 తగ్గింపు ధరల వద్ద పొందవచ్చు.

 

ఫ్లిప్‌కార్ట్ పోకో డేస్ సేల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ పోకో డేస్ సేల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న పోకో డేస్ సేల్ లో పోకో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను అమెరికన్ ఏక్సప్రెస్ కార్డుల మీద కొనుగోలు చేసిన వారికి రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు మీద 5% క్యాష్ బ్యాక్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

పోకో X3 HDR10 సర్టిఫికేషన్‌ AMOLED డిస్ప్లే

పోకో X3 HDR10 సర్టిఫికేషన్‌ AMOLED డిస్ప్లే

పోకో X3 స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + AMOLED డిస్ప్లే ను 1,080x2,340 పిక్సెల్ పరిమాణంలో LCD ప్యానెల్ మద్దతుతో వస్తుంది. అలాగే ఇది 120HZ రిఫ్రెష్ రేట్, 240HZ శాంప్లింగ్ రేట్ మరియు HDR10 సర్టిఫికేషన్‌కు మద్దతును ఇస్తుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్‌తో రన్ అవుతూ అడ్రినో 618 GPU మరియు 6GB ర్యామ్,64GB మరియు 128GB స్టోరేజ్ ఎంపికల‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్‌ ద్వారా మెమొరిని 256GB వరకు విస్తరించవచ్చు.

పోకో X3 స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్

పోకో X3 స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్

పోకో X3 స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ మరియు హెడ్ఫోన్ జాక్ వంటివి కలిగి ఉన్నాయి. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై, బ్లూటూత్, 4G, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది మరియు ఫోన్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఫోన్ IP53 గా రేట్ చేయబడింది. చివరగా, పోకో ఎక్స్ 3 165.3x76.8x9.4 మిమీ మరియు 215 గ్రాముల బరువును కొలుస్తుంది.

పోకో M2 మీడియాటెక్ హెలియో G80 SoC సాఫ్ట్‌వేర్

పోకో M2 మీడియాటెక్ హెలియో G80 SoC సాఫ్ట్‌వేర్

పోకో M2 స్మార్ట్‌ఫోన్‌ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G80 SoC మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 6GB ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు. మెరుగైన గేమింగ్ పనితీరును అందించడానికి పోకో హైపర్‌ఇంజైన్ గేమింగ్ టెక్నాలజీని జోడించింది. ఫీచర్‌లో భాగంగా డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ VoLTE మరియు డ్యూయల్ VoWiFi ని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco Days Sale Starts on Flipkart With Huge Discount Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X