ఫ్లిప్‌కార్ట్‌లో నేడు పోకో F3 GT స్మార్ట్‌ఫోన్‌ మొదటి సేల్!! ఆఫర్ ధర?

|

ప్రముఖ POCO మొబైల్ సంస్థ ఇండియాలో ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన POCO F3 GT గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ తన యొక్క అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రముఖ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ యొక్క ప్లాట్ఫారమ్లో మొదటిసారి ప్రారంభం కానున్నాయి. 67W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,065mAh అతి పెద్ద బ్యాటరీ మరియు ట్రిపుల్ కెమెరా ఫీచర్స్ మరియు 8GB RAM మరియు 256GB స్టోరేజ్ ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

భారతదేశంలో పోకో F3 GT ధరలు & సేల్స్ వివరాలు

భారతదేశంలో పోకో F3 GT ధరలు & సేల్స్ వివరాలు

పోకో F3 GT గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్‌ యొక్క ధర రూ.26,999 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.28,999 చివరిగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.30,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ ను వినియోగదారులు నేడు రూ.1000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.25,999, రూ.27,999, మరియు రూ.29,999 తగ్గింపు ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుదారులకు రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ గన్‌మెటల్ సిల్వర్ మరియు ప్రిడేటర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

పోకో F3 GT స్పెసిఫికేషన్స్
 

పోకో F3 GT స్పెసిఫికేషన్స్

పోకో F3 GT గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 6.67-అంగుళాల టర్బో అమోలేడ్ 10-బిట్ డిస్ప్లే, హెచ్‌డిఆర్ 10+ సపోర్ట్, 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 480HZ టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగి ఉన్నాయి. ఇది DC డిమ్మింగ్‌కు కూడా మద్దతు ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది.

ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 60% తగ్గింపు!!మిస్ అవ్వకండిల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 60% తగ్గింపు!!మిస్ అవ్వకండి

పోకో F3 GT ఆప్టిక్స్

పోకో F3 GT ఆప్టిక్స్

పోకో F3 GT గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.65 ఎపర్చరుతో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలు కలిగి ఉన్నాయి. మెయిన్ సెన్సార్ ED గాజుతో తయారు చేయబడి ఉంది. ఇది సాధారణంగా ఫోటోల యొక్క మంచి స్పష్టత కోసం DSLR లెన్స్‌లను ఉపయోగించబడుతుంది. కెమెరా మాడ్యూల్ వ్యూహాత్మక RGB గ్లో మరియు మెరుపు ఫ్లాష్ లాంటి ఫ్లాష్ మాడ్యూల్ కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

పోకో F3 GT బ్యాటరీ

పోకో F3 GT బ్యాటరీ

పోకో F3 GT గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ 5,065mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో లభిస్తుంది. ఇది కేవలం 15 నిమిషాల్లో ఫోన్ ను సగం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఇది IP53 రేట్ చేయబడింది మరియు గేమింగ్ చేసేటప్పుడు మంచి వాయిస్ నాణ్యత కోసం మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. ఇది Wi-Fi గేమింగ్ యాంటెన్నా, ఖచ్చితమైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ మరియు వైబ్రేషన్‌తో కూడిన X- షాకర్స్, GT స్విచ్ మరియు మాగ్లెవ్ ట్రిగ్గర్‌లకు మద్దతు ఇస్తుంది. వేడిని వెదజల్లడానికి మెరుగైన ఏరోస్పేస్ గ్రేడ్ వైట్ గ్రాఫేన్ హీట్ సింక్ ను కలిగి ఉంది. అలాగే రే ట్రేసింగ్ సామర్థ్యాలను అందించే హైపర్ఇంజైన్ 3.0 కు ఫోన్ మద్దతు ఇస్తుంది. డాల్బీ అట్మోస్ మద్దతుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. పోకో ఎఫ్ 3 జిటిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌పిర్ంట్ సెన్సార్ ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Pco F3 GT First Sale Live on Flipkart Big Saving Days Sale in India Today: Check Pice Discount Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X