పోకో ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి కొత్తగా పోకో F3 GT!! ఫీచర్స్ ఇవే...

|

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి పోకో ప్రసిద్ది చెందింది. ఈ సంస్థ షియోమి యొక్క స్పిన్-ఆఫ్ బ్రాండ్ కానీ ఇది గత సంవత్సరం జనవరిలో స్వతంత్రమై కొత్త బ్రాండ్ గా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. అయినప్పటికీ షియోమి మరియు రెడ్‌మి యొక్క రీబ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నట్లు కొన్ని అపవాదులు ఉన్నాయి. ఇప్పుడు పోకో బ్రాండ్ రెడ్‌మి K40 గేమింగ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయనుంది. ఇండియాలో పోకో F3 GT పేరుతో లభించే ఈ వేరియంట్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో F3 GT

పోకోకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ అనుజ్ శర్మ ఇటీవల పోకో F3 GTని భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరిస్తూ ఒక చిన్న వీడియోను ట్విట్టర్‌లో వెల్లడించారు. పోకో F3 GT స్మార్ట్‌ఫోన్‌ అనేది రెడ్‌మి K40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని కంపెనీ చెప్పలేదు కాని ఆన్‌లైన్‌లో లీక్‌లు మరియు మార్కెట్ అంచనాలు అన్నీ కూడా ఆ కోణంలో మాత్రమే చూపుతున్నాయి.

అనుజ్ శర్మ

అనుజ్ శర్మ విడుదల చేసిన వీడియో యొక్క సమాచారం ప్రకారం ఇందులో ధృవీకరించబడిన మరోక విషయం ఏమిటంటే పోకో F3 GT మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC చేత శక్తిని పొందుతుంది. అయితే ఈ డివైస్ గురించి ఇతర వివరాలు ప్రస్తుతానికి ధృవీకరించబడలేదు. అయితే రెడ్‌మి K40 గేమింగ్ ఎడిషన్ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదలైంది. పోకో F3 GT నిజానికి రెడ్‌మి K40 గేమింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండ్ వెర్షన్ అయితే కనుక అదే ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

FHD+ అమోలెడ్ డిస్‌ప్లే

పోకో F3 GT స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 480 HZ టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఇంకా మెరుగైన వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని అనుమతించడానికి డిస్ప్లే HDR10 + కు మద్దతుతో వస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు మద్దతుతో లభిస్తుంది. గేమింగ్ అవసరాలను తీర్చడానికి ఇది రెడ్‌మి K40 గేమింగ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో చూసినట్లుగా 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5065mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్‌

పోకో F3 GT స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విభాగంలో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. ప్రాధమిక సెన్సార్ 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 2MP మాక్రో సెన్సార్‌తో జతచేయబడిన 64MP లెన్స్ అని భావిస్తున్నారు. సెల్ఫీలను క్లిక్ చేయడానికి ముందు భాగంలో 16MP సెన్సార్ ఉండవచ్చు. ఈ పరికరం ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12.5 లో నడుస్తుందని భావిస్తున్నారు. పరికరం యొక్క ధర ప్రస్తుతానికి తెలియదు. ఇది పోకో పరికరం కాబట్టి, మిడ్‌రేంజ్ విభాగంలో ఏదైనా కంటే ఎక్కువ ధర ఉంటుందని మేము ఆశించము.

Best Mobiles in India

English summary
Poco F3 GT New Smartphone Video Revealed: Features, India Launch Date, Specifications and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X