కొత్త Poco F4 5G ధర లీక్ అయింది ! స్పెసిఫికేషన్లు , వివరాలు చూడండి.

By Maheswara
|

Poco త్వరలో Poco F4 5Gని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. రాబోయే Poco F4 యొక్క కొన్నిస్పెసిఫికేషన్ లను బ్రాండ్ ఇప్పటికే ధృవీకరించింది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక మైక్రోసైట్ ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క లైవ్ ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఇప్పుడు మరొక లీక్ విడుదలైంది,లాంచ్ ఇంకా ప్రకటించనప్పటికీ, Poco F4 ధర అధికారిక ప్రకటనకు ముందే అంచనా వేయబడింది.

 

Poco F4 5G ధర

Poco F4 5G ధర

Poco F4 ధర, Xiaomi రిటైలర్ (Rootmygalaxy.net ద్వారా) ద్వారా లీక్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో ఒకే వేరియంట్‌లో వస్తుందని అంచనా వేయబడింది. దీని ధర $459 (సుమారు రూ. 35,800). అయితే, Poco F4 భారతదేశంలో బహుళ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ చేయబడుతుంది అని భావిస్తున్నారు. భారత దేశం లో ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ ధర రూ.26,999 బేస్ మోడల్‌కు ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో, పరికరం రూ. 23,999 అమ్ముడవ్వొచ్చు. దీనిపై అధికారిక ధృవీకరణ లేనందున, దీనిని ఊహాగానాలుగా మాత్రమే తీసుకోవడం మంచిది.

Poco F4 5G ఫీచర్లు: ఇప్పటివరకు మనకు తెలిసినవి.
 

Poco F4 5G ఫీచర్లు: ఇప్పటివరకు మనకు తెలిసినవి.

Poco F4 5G స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌తో జత చేయబడుతుంది.ఈ పరికరం లిక్విడ్‌కూల్ 2.0 టెక్నాలజీని కలిగి ఉంటుందని బ్రాండ్ ధృవీకరించింది. ఇది తప్ప, ప్రస్తుతానికి ఏమీ తెలియదు. అయితే, రాబోయే Poco F4 Redmi K40S యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పబడింది. కావున, దాని ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి HD+ AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. 67W ఛార్జింగ్‌తో 4,520 mAh బ్యాటరీ ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి, ఇందులో 64MP లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో షూటర్ ఉండవచ్చు. ముందు వైపు,  ఇది 20MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది మరియు Android 12-ఆధారిత MIUI 13 పై రన్ అవుతుంది.

Poco F4 5G: చౌకైన స్నాప్‌డ్రాగన్ 870-ఆధారిత ఫోన్ గా ఉండబోతోంది.

Poco F4 5G: చౌకైన స్నాప్‌డ్రాగన్ 870-ఆధారిత ఫోన్ గా ఉండబోతోంది.

పైన పేర్కొన్న ధర నిజమని తేలితే, అది భారతదేశంలోనే అత్యంత చౌకైన స్నాప్‌డ్రాగన్ 870-శక్తితో పనిచేసే ఫోన్ అవుతుంది. ప్రస్తుతానికి,రూ. 30,000 ధర లో Xiaomi Mi 11X, iQOO Neo 6 మరియు iQOO 7 సరసమైన స్నాప్‌డ్రాగన్ 870 పవర్డ్ ఫోన్‌ల కు ఇది గట్టి పోటీ కానుంది.

Best Mobiles in India

English summary
Poco F4 5G Price Tipped And Flipkart Revealed Design Ahead Of The Launch. Here Are Full Details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X