Poco F4 5G మొదటి అమ్మకంలో రూ.4000 తగ్గింపు!! ఫ్రీగా యూట్యూబ్,Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ కూడా

|

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్ పోకో గతవారం F-సిరీస్‌లో పోకో F1కి అప్‌గ్రేడ్‌గా కొత్తగా పోకో F4 5G ని ప్రీమియం సెగ్మెంట్‌ విభాగంలో విడుదల చేసింది. ఈ ప్రీమియం ఫోన్‌ యొక్క సేల్స్ మొదలయ్యాయి. 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో మరియు డాల్బీ విజన్‌ మద్దతుతో కూడిన AMOLED డిస్‌ప్లే మరియు ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్, గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ మరియు 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతు వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ ఫోన్ గతవారం గ్లోబల్ ఈవెంట్‌లో ప్రారంభించబడింది.

 

Poco F4 5G

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క నేటి మొదటి సేల్స్ సందర్భంగా కంపెనీ కొన్ని ఆఫర్‌లను అందిస్తున్నది. కంపెనీ అందించే నేటి డీల్‌ కొద్దిగా మెరుగ్గా ఉంది. అయితే ఈ ఆఫర్‌లలో చాలా వరకు దీనికి కూడా ఒక మినహాయింపు ఉంది. అంటే ఆన్‌లైన్‌లో డిస్కౌంట్ పొందడానికి మీరు నిర్దిష్ట కార్డును కలిగి ఉండాలి. ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి మొదలయ్యే అమ్మకంలో లభించే ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Poco F4 5G ధరలు

Poco F4 5G ధరలు

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్స్ లో మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 6GB RAM బేస్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 కాగా 8GB RAM మిడ్-టైర్ వేరియంట్ యొక్క ధర రూ.29,999. చివరిది 12GB RAM హై-రేంజ్ మోడల్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ నెప్ట్యూన్ గ్రీన్ మరియు నైట్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదటి సేల్ ప్రారంభమయ్యాయి.

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్
 

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్‌లో లభించే ఆఫర్ల విషయానికి వస్తే కనుక ఈ ఫోన్ ని కొనుగోలు చేసే వారు క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే కనుక రూ.4,000 వరకు అధిక మొత్తంలో తగ్గింపును పొందేందుకు అర్హులవుతారు. రూ.4,000 తగ్గింపును పొందడానికి మీరు తప్పనిసరిగా పాటించాల్సిన షరతులు కూడా ఉన్నాయి. పోకో నేటి విక్రయం నుండి F4 5G కొనుగోలుదారులందరికీ రూ.1,000 తగ్గింపును అందిస్తుంది. ఇది బేస్ మోడల్ ధర రూ.26,999కి, మిడ్-టైర్ ధర రూ.28,999కి మరియు టాప్ మోడల్ ధర రూ.32,999కి తగ్గింది. కొనుగోలుదారులు SBI కార్డ్‌ను కలిగి ఉన్నట్లయితే కనుక మీకు అదనంగా రూ.3,000 తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. రూ.3,000 తగ్గింపును అందుకున్న తర్వాత బేస్ మోడల్‌ రూ.23,999, మిడ్-రేంజ్ వెర్షన్‌ రూ.25,999 మరియు హై-ఎండ్ మోడల్‌ రూ.29,999 తక్కువ ధరల వద్ద లభిస్తాయి. అంటే మొదటి సేల్‌లో మీరు రూ.27,999 ధర వద్ద గల ఫోన్‌ను రూ.23,999 కంటే తక్కువ ధరకే పొందవచ్చు.

Poco F4 5G సేల్‌ Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్

Poco F4 5G సేల్‌ Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్‌లో లభించే అద్భుతమైన ఆఫర్లలో మరికొన్ని కూడా ఉన్నాయి. దీనిని కొనుగోలు చేసిన వారికి రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో పాటు Disney+ Hotstar యొక్క సబ్‌స్క్రిప్షన్‌ని ఒక సంవత్సరం చెల్లుబాటు కాలంతో కూడా పొందుతారు. అయితే ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి.

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఫ్లాగ్‌షిప్ కిల్లర్ వలె ఉంది. ఇది మిడ్-రేంజ్ ధర వద్ద హై-ఎండ్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 870 ప్రాసెసర్‌ను కలిగి ఉండి శక్తిని పొందుతుంది. ఇది 2020 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు శక్తినిచ్చే స్నాప్‌డ్రాగన్ 865 యొక్క ట్వీక్డ్ వెర్షన్. ఇది గరిష్టంగా 12GB RAM మరియు 256GB UFS 3.1 స్టోరేజ్ తో, లభిస్తూ భారీ యాప్‌లు మరియు మెమరీ-ఇంటెన్సివ్ గేమ్‌లను సమర్థవంతంగా నిర్వహించగలదు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ E4 AMOLED డిస్‌ప్లేను 395 PPI పిక్సెల్ డెన్సిటీ, 1300 nits గరిష్ట ప్రకాశంతో లభిస్తుంది. సినిమాలు మరియు గేమ్‌లలో ఇంకీ బ్లాక్స్ కోసం Dolby Vision మరియు HDR10+కి మద్దతును కలిగి ఉంది.

ఆప్టిక్స్

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుంది. ఇందులో OISతో 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 119-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో పంచ్-హోల్ డిజైన్ లో 20-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

కనెక్టివిటీ

Poco F4 5G స్మార్ట్‌ఫోన్ 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS/ NaVIC మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ మరియు హై-రెస్ సపోర్ట్‌తో Poco F4 5Gలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. అలాగే ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500mAh Li-Polymer బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Poco F4 5G Smartphone First Sale Live on Flipkart: Price, Specs, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X