Home
News

Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు

Poco సంస్థ యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ లియు ఇటీవల తమ కొత్త ఫోన్ ఖచ్చితమైన మోనికర్‌ను ధృవీకరించకుండా కొత్త Poco F సిరీస్ ఫోన్ రాకను టీజ్ చేసారు. ఈ ఫోన్ Poco F6 మోడల్ అని సూచించబడింది. షియోమీ సబ్-బ్రాండ్ ఈ కొత్త F సిరీస్ పరికరం యొక్క లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ దాని కంటే ముందే, దాని స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీక్ చేయబడ్డాయి.

ఇది కొత్తగా విడుదలైన స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 SoC ప్రాసెసర్ కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. Poco F6 ఇంకా లాంచ్ చేయని Redmi Note 13 Turbo యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని అంచనా వేయబడింది.

Poco F6 Specifications Leaked

ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదిక ప్రకారం, HyperOS సోర్స్ కోడ్‌ను ఉటంకిస్తూ, Poco F6 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 SoC లో రన్ అవుతుందని పేర్కొంది. "peridot" అనే సంకేతనామం గల Poco ఫోన్ ప్రపంచంలోనే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేసే రెండవ హ్యాండ్‌సెట్ అవుతుంది. షియోమీ సంస్థ ఈ నెల ప్రారంభంలో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో మొదటి ఫోన్‌గా Civi 4 ప్రోని లాంచ్ చేసింది.

ఇంకా,ఈ Poco F6 స్మార్ట్ ఫోన్ సోనీ IMX882 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఇటీవల లాంచ్ అయిన, Realme 12 Pro 5G మరియు iQoo Z9 5G ఫోన్లలో కూడా ఇదే సెన్సార్ ఉపయోగించబడుతుంది. ఈ కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది అంతర్గత మోడల్ నంబర్ "N16T"ని కలిగి ఉందని చెప్పబడింది.

పోకో సంస్థ ఈ Poco F6 లో TCL మరియు Tianma నుండి డిస్‌ప్లే ప్యానెల్‌లను ఉపయోగించినట్లు రిపోర్టులు తెలియచేస్తున్నాయి. అయితే,ఈ డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లపై ఇంకా ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు.

Poco F6 చాలా కాలంగా వార్తలలో ఉంది. సంస్థ యొక్క గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ లియు (@DavidBlueLS) ఇటీవల ఈ పరికరం ఉనికిని ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఇది Poco F6 ప్రో తో పాటు ఏప్రిల్ మరియు మే మధ్య అధికారికంగా అందుబాటులోకి వస్తుంది అని అంచనాలున్నాయి. ఈ పోకో ఫోన్ Redmi Note 13 Turbo యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని పుకారు వచ్చింది.

ఇంకా, ఈ Poco F6 ఫోన్ గత సంవత్సరం వచ్చిన Poco F5 5G కంటే మెరుగైన అప్‌గ్రేడ్‌ ఫీచర్ లతో వస్తుందని భావిస్తున్నారు. Poco F5 5G గత ఏడాది మే లో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర రూ. 29,999 ట్యాగ్‌తో లాంచ్ చేయబడింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco F6 Specifications Leaked Expected To Feature Snapdragon 8s Gen 3 SoC, 50MP Camera. Complete Details Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X