Poco M2, C3 స్మార్ట్‌ఫోన్‌ల మీద భారీ ధర తగ్గింపు!! మిస్ అవ్వకండి...
షియోమి స్మార్ట్ ఫోన్ సంస్థ నుంచి విడిపోయి బడ్జెట్ ధరలో ఫోన్‌లను విడుదల చేసిన పోకో సంస్థ యొక్క అత్యంత సరసమైన రెండు ఫోన్‌లు పోకో C3 మరియు పోకో M2 ల యొక్క ధరలను సంస్థ తగ్గించింది. ఈ రెండు ఫోన్‌ల ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్‌ల మీద సంస్థ దాదాపుగా రూ.1500 వరకు ధరను తగ్గించింది. మునుపటి ధరతో పోలిస్తే ధర తగ్గింపు పొందిన తరువాత పోకో M2 యొక్క 6GB ర్యామ్ వేరియంట్ కూడా రూ.9,999 అత్యంత సరసమైన ధరల వద్ద లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M 2 ఫోన్ తగ్గింపు ధరల వివరాలు
పోకో M 2 ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ యొక్క బేస్ వేరియంట్ మీద రూ.1000 తగ్గింపు పొందిన తరువాత వినియోగదారులు ఇప్పుడు పోకో M 2 ను రూ.9,999 ధర వద్ద పొందవచ్చు. అలాగే పోకో M2 యొక్క 128GB వేరియంట్ మీద రూ.1,500 తగ్గింపు పొందిన తరువాత ఈ వేరియంట్ యొక్క ధర 10,499 రూపాయలకు పడిపోయింది.

పోకో C 3 ఫోన్ తగ్గింపు ధరల వివరాలు
సాధారణ బడ్జెట్ ధరలో లభించే పోకో C 3 యొక్క ధరల తగ్గింపు విషయానికొస్తే 3GB ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ను ఇప్పుడు రూ.7,499 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ యొక్క టాప్ వేరియంట్ ను రూ.8,499 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మీద తగ్గింపులు గణనీయమైనవి కావు కాని బడ్జెట్ వినియోగదారునికి ఈ తగ్గింపు చాలా ముఖ్యమైనది.

పోకో M2 మీడియాటెక్ హెలియో G80 SoC సాఫ్ట్‌వేర్
పోకో M2 స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G80 SoC మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 6GB ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు. మెరుగైన గేమింగ్ పనితీరును అందించడానికి పోకో హైపర్‌ఇంజైన్ గేమింగ్ టెక్నాలజీని జోడించింది. ఫీచర్‌లో భాగంగా డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ VoLTE మరియు డ్యూయల్ VoWiFi ని కలిగి ఉంది.

పోకో M2 స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్స్
పోకో M2 స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000W బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G వోల్‌టిఇ, వై-ఫై 802.11 AC, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. పోకో M2 సాఫ్ట్‌వేర్ ఎండ్‌లోని ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 ను MIUI 12 తో త్వరలో విడుదల చేస్తుంది. చివరగా ఈ ఫోన్ స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ మరియు పిచ్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








