Poco M2 Pro మొదటి సేల్స్ ప్రారంభం నేడే!!! ఆఫర్స్ బ్రహ్మాండం...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క ఉప బ్రాండ్ పోకో కంపెనీ గత వారం ఇండియాలో తన మూడవ స్మార్ట్‌ఫోన్ పోకో M2 ప్రో ను విడుదల చేసింది. ఈ రోజు నుండి ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదలుకానున్నాయి.

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్స్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్స్

ఫ్లిప్‌కార్ట్ లో మధ్యాహ్నం 12PM నుండి పోకో 2.0 బ్రాండ్ స్ట్రాటజీ కింద ఈ కొత్త ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో పోకో అధికారికంగా దేశంలో రూ.15 వేల ధరల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఈ పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ 33W వేగవంతమైన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ , క్వాడ్ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్‌ఫోన్ మీద అందిస్తున్న మరిన్ని ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Bharti Airtel వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లాంచ్ త్వరలోనే...Also Read: Bharti Airtel వీడియో-కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లాంచ్ త్వరలోనే...

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రెండు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ యొక్క ధర రూ.13,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద లభిస్తుంది. చివరిగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క హై-ఎండ్ వేరియంట్ రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, గ్రీన్ మరియు మరియు షేడ్స్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

 

Also Read: N95 పేస్ మాస్క్ ల ఆవిష్కరణకు కొత్త పరికరంను తయారుచేసిన Chakr InnovationAlso Read: N95 పేస్ మాస్క్ ల ఆవిష్కరణకు కొత్త పరికరంను తయారుచేసిన Chakr Innovation

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇది రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క గ్లోబల్ వేరియంట్‌కు సమానమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి వెనుక భాగంలో మూడు కలర్ వేరియంట్ల యొక్క డ్యూయల్టోన్ గ్లాస్ ముగింపుతో వస్తుంది. అలాగే ఫోన్ యొక్క దిగువ భాగంలో కెవ్లర్‌ ఆకృతి ముగింపుతో వస్తుంది.

పోకో M2 ప్రో స్పెసిఫికేషన్స్

పోకో M2 ప్రో స్పెసిఫికేషన్స్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 60HZ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G మరియు అడ్రినో 618 GPUతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 4GB/ 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 తో రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ యొక్క అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు.

 

Also Read: Jio, Airtel, Vodafone అధిక ధరల వద్ద అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...Also Read: Jio, Airtel, Vodafone అధిక ధరల వద్ద అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌ కెమెరా , 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాల‌తో జత చేయబడి ఉన్నాయి. ఈ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ తో పనిచేస్తుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.

Best Mobiles in India

English summary
Poco M2 Pro First Sale Starts Today in India via Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X