Poco M2 Pro స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ త్వరలోనే!!! ఫీచర్స్ బ్రహ్మాండం...

|

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి నుండి పోకో ఈ సంవత్సరం ప్రారంభంలో విడిపోయింది. 2018 నుండి ఈ సంస్థ కేవలం మూడు ఉత్పత్తులను మాత్రమే విడుదల చేసింది. కానీ ఇవన్ని కూడా రెడ్‌మి పరికరాల రీబ్రాండెడ్ వెర్షన్ తప్ప మరేమీ కాదు అని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోకో సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్ పోకో M2 ప్రో ను జూలై 7 న ఇండియాలో లాంచ్ చేయనున్నది.

పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్

పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్

పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ రెడ్‌మి ఫోన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు అని కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో విడుదల చేస్తున్నట్లు సంస్థ నిర్ధారించింది. అంతేకాకుండా ఈ పోకో M2 ప్రో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 720G Soc మరియు 6GB ర్యామ్‌తో ప్యాకేజీతో విడుదల అవుతున్నట్లు కొన్ని లీక్ల ద్వారా తెలిసింది.

 

Also Read: Dish TV వినియోగదారులకు బంపర్ ఆఫర్!!! Eros Now కు ఉచిత యాక్సిస్...Also Read: Dish TV వినియోగదారులకు బంపర్ ఆఫర్!!! Eros Now కు ఉచిత యాక్సిస్...

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రధానంగా టాప్-ఎండ్ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్లతో ఇండియాలో రూ.15,000 లోపు మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నది. కాబట్టి ఈ ఫోన్ యొక్క ధర ఇండియాలో రూ.15 వేల లోపు మాత్రమే ఉండవచ్చు. జూలై 7 న ఇండియాలో దీనిని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. దీని యొక్క ఖచ్చితమైన ధర వివరాలు లాంచ్ రోజున తెలుస్తుంది.

 

Also Read:BookMyShow OTT ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫీచర్స్ ఇవే....Also Read:BookMyShow OTT ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫీచర్స్ ఇవే....

పోకో M2 ప్రో స్పెసిఫికేషన్స్

పోకో M2 ప్రో స్పెసిఫికేషన్స్

పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ గురించి విడుదలైన సమాచారం ప్రకారం ఇది కొత్త స్నాప్‌డ్రాగన్ 720 SoC చిప్ సెట్ మరియు 6GB RAM తో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 సాఫ్ట్ వెర్ తో రన్ అవుతుంది. అలాగే ఇది బ్లూటూత్ SIG మరియు బ్లూటూత్ v5.0 కనెక్టివిటీతో వస్తుంది.

"మేడ్ ఇన్ ఇండియా" లోగోతో పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్

ఇండియాలో విడుదల చేయబోయే పోకో స్మార్ట్‌ఫోన్‌ను ధృవీకరిస్తూ కొన్ని వారాల క్రితం కంపెనీ వీడియో టీజర్‌ను విడుదల చేసింది. సంస్థ యొక్క ఈ వీడియో టీజర్‌లో మేక్ ఇన్ ఇండియా చొరవకు కట్టుబడి ఉన్నట్లు కూడా ప్రకటించింది. ఇండియాలో పెరుగుతున్న చైనా వ్యతిరేక భావన దృష్ట్యా షియోమి తన రిటైల్ స్టోర్ ఫ్రంట్‌ల మీద మేడ్ ఇన్ ఇండియా లోగోలను కవర్ చేయడం ప్రారంభించింది. దేశంలో షియోమి సంస్థ యొక్క స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ బ్యాండ్ వంటివి అత్యధికంగా అమ్ముడై భారతదేశపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గా కూడా గత సంవత్సరం ఆవిర్భవించింది. షియోమి డివిజన్ పరిధిలో పోకో ఒక స్వతంత్ర బ్రాండ్ కావడంతో ఇది మేడ్ ఇన్ ఇండియా చొరవపై కఠినంగా దృష్టి సారిస్తుంది.

పోకో M2 ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు

పోకో M2 ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు

పోకో M2 ప్రో స్మార్ట్ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ యొక్క అధికారిక వెబ్ సైట్ ద్వారా నిర్ధారించబడింది. ఫ్లిప్‌కార్ట్‌లో షేర్ చేసిన పోస్టర్‌లో పోకో M2 ప్రో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని ధృవీకరించబడింది. ఇండియాలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో వస్తున్న మరొక ఫోన్ కేవలం రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ మాత్రమే. పోకో M2 ప్రో ఫోన్ వేగంగా ఛార్జ్ చేయగలుగుతుంది. అంతేకాకుండా దీని యొక్క వెనుకవైపు క్వాడ్-కెమెరా సెటప్‌ను చూపించే మరో టీజర్ ఇమేజ్ మినహా పోకో ఫోన్ గురించి ఏమీ వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
Poco M2 Pro India Launch on July 7: Launch Date, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X