Home
News

6.7-inch డిస్‌ప్లే,5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ Poco M2 Pro సేల్ నేడే!!!

ఇండియాలో తక్కువ కాలంలో గుర్తింపు పొందిన చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలలో పోకో కూడా ఒకటి. పోకో సంస్థ ఇండియాలో విడుదల చేసిన మూడవ ఫోన్ పోకో M2 ప్రో. ఇండియాలో విడుదలైనప్పటి నుంచి ఫ్లాష్ అమ్మకాల ద్వారా మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ ఫోన్ ఈ రోజు మరోసారి ఫ్లాష్ సేల్ పద్దతిలో ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12:00 గంటలకు అమ్మకానికి రానున్నది. స్నాప్‌డ్రాగన్ 720G చిప్‌సెట్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో ధరల వివరాలు

ఇండియాలో రెండు వేరు వేరు స్టోరేజ్ విభాగంలో విడుదలైన పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ నేడు ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.13,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. చివరిగా హై-ఎండ్ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, గ్రీన్ మరియు మరియు షేడ్స్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

పోకో M2 ప్రో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లే

పోకో M2 ప్రో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లే

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 4GB/ 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్  స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు.

పోకో M2 ప్రో 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌ కెమెరా , 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాల‌తో జత చేయబడి ఉన్నాయి. ఈ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ తో పనిచేస్తుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.  

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇది రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క గ్లోబల్ వేరియంట్‌కు సమానమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి వెనుక భాగంలో మూడు కలర్ వేరియంట్ల యొక్క డ్యూయల్టోన్ గ్లాస్ ముగింపుతో వస్తుంది. అలాగే ఫోన్ యొక్క దిగువ భాగంలో కెవ్లర్‌ ఆకృతి ముగింపుతో వస్తుంది. 

Best Mobiles in India

English summary
Poco M2 Pro Smartphone Flash Sale Start Today via Flipkart at 12PM : Price, Specs and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X