Poco M2 Pro కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!!! అందుబాటు ధరలోనే...

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి నుంచి పోకో విడిపోయాక ఇండియాలో విడుదల చేసిన మూడవ ఫోన్ పోకో M2 ప్రో. ఇప్పుడు సంస్థ యొక్క మూడవ స్మార్ట్‌ఫోన్‌ అధికారికంగా పోకో 2.0 బ్రాండ్ స్ట్రాటజీ కింద విడుదల అయింది.

పోకో M2 ప్రో లాంచ్

పోకో M2 ప్రో లాంచ్

ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.15,000 ధరల విభాగంలో విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్‌మి నోట్ 9 ప్రో సిరీస్‌ యొక్క రీబ్రాండ్ వెర్షన్ అని కూడా పుకార్లు ఉన్నాయి.

 

Also Read: Realme స్మార్ట్‌ఫోన్లు, టీవీల కొనుగోలుకు సరైన సమయం ఇదే!! ఆఫర్స్ బ్రహ్మాండం...Also Read: Realme స్మార్ట్‌ఫోన్లు, టీవీల కొనుగోలుకు సరైన సమయం ఇదే!! ఆఫర్స్ బ్రహ్మాండం...

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో ధరల వివరాలు

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రెండు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలలో విడుదల అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ యొక్క ధర రూ.13,999 కాగా 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద లభిస్తుంది. చివరిగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క హై-ఎండ్ వేరియంట్ రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, గ్రీన్ మరియు మరియు షేడ్స్ బ్లాక్ వంటి మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారి జూలై 14, 2020 న ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

 

Also Read: అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పూర్తి సమాచారం!!! ఇవే బెస్ట్...Also Read: అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల పూర్తి సమాచారం!!! ఇవే బెస్ట్...

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇది రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క గ్లోబల్ వేరియంట్‌కు సమానమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి వెనుక భాగంలో మూడు కలర్ వేరియంట్ల యొక్క డ్యూయల్టోన్ గ్లాస్ ముగింపుతో వస్తుంది. అలాగే ఫోన్ యొక్క దిగువ భాగంలో కెవ్లర్‌ ఆకృతి ముగింపుతో వస్తుంది.

పోకో M2 ప్రో స్పెసిఫికేషన్స్

పోకో M2 ప్రో స్పెసిఫికేషన్స్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 60HZ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720G మరియు అడ్రినో 618 GPUతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 4GB/ 6GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 తో రన్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ యొక్క అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు.

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్

పోకో M2 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌ కెమెరా , 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాల‌తో జత చేయబడి ఉన్నాయి. ఈ ఫోన్ స్ప్లాష్ ప్రూఫ్ తో పనిచేస్తుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది.

Best Mobiles in India

English summary
Poco M2 Pro Smartphone Launched in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X