Poco M2 6GB RAM గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్ నేడే!!! బ్రహ్మాండమైన ఆఫర్లతో....
రూ.10,000 బడ్జెట్ ధరలో గేమింగ్ కోసం అనువైన 6GB RAM ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌లను కొనాలని చూస్తున్న వారికి పోకో సంస్థ గత నెలలో మిడ్-రేంజ్ ధర విభాగంలో విడుదల చేసిన పోకో M2 స్మార్ట్‌ఫోన్ మంచి ఛాయస్ గా ఉంది. ఈ ఫోన్ యొక్క అమ్మకం నేడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలుకానున్నది. మీడియాటెక్ హెలియో G80 SoC, 5,000mAh బ్యాటరీ మరియు 6GB RAM వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్న పోకో M2 స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M2 స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ వివరాలు
పోకో M2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ యొక్క ధర రూ.10,999 కాగా 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.12,499. ఈ ఫోన్ యొక్క సేల్ ఆఫర్‌ల విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంక్ వినియోగదారులకు దీని కొనుగోలు మీద 750 రూపాయల విలువైన "ఇన్‌స్టంట్ డిస్కౌంట్" లభిస్తుంది.

పోకో M2 60HZ రిఫ్రెష్ రేట్ LCD డిస్‌ప్లే
పోకో M2 స్మార్ట్‌ఫోన్ 6.53-అంగుళాల LCD డిస్‌ప్లేను 60HZ రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో G80 SoC మరియు అడ్రినో 618 GPUతో రన్ అవుతూ 6GB ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజీతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ అప్ డేట్ల విషయానికి వస్తే పోకో కొత్త కొత్త అప్ డేట్ లను అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో పంచ్-హోల్ సెటప్ లోపల 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇందులో గల సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సులభంగా ఫోన్ ను అన్ లాక్ చేయవచ్చు. మెరుగైన గేమింగ్ పనితీరును అందించడానికి పోకో హైపర్‌ఇంజైన్ గేమింగ్ టెక్నాలజీని జోడించింది. ఫీచర్‌లో భాగంగా డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ VoLTE మరియు డ్యూయల్ VoWiFi ని కలిగి ఉంది.

పోకో M2 క్వాడ్ రియర్ కెమెరా సెటప్
పోకో M2 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుకభాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ సెన్సార్‌తో మెయిన్ కెమెరా, పోకో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా కూడా లభిస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. బ్లూటూత్ 5.0, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో, ఐఆర్ బ్లాస్టర్, 3.5mm ఆడియో సాకెట్ మరియు డ్యూయల్ మైక్రోఫోన్ వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది.

పోకో M2 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 5,000W బ్యాటరీ
పోకో M2 స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000W బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G వోల్‌టిఇ, వై-ఫై 802.11 AC, బ్లూటూత్ 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. పోకో M2 సాఫ్ట్‌వేర్ ఎండ్‌లోని ఆండ్రాయిడ్ 10-ఆధారిత MIUI 11 ను MIUI 12 తో త్వరలో విడుదల చేస్తుంది. చివరగా ఈ ఫోన్ స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ మరియు పిచ్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications