Poco M3 కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానున్నది!!! ధర ఎంతో తెలుసా??
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్ గా మార్కెట్లోకి అడుగుపెట్టిన పోకో సంస్థ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచ్ లతో అందరి దృష్టిని ఆకట్టుకున్నది. ఈ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో పోకో M2తో పాటుగా పోకో M2 ప్రోను కూడా ఇండియాలో విడుదల చేసింది. సంస్థ ఇప్పుడు వీటికి అప్ డేట్ వెర్షన్ గా పోకో M3 ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. పోకో M3 ను నవంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ఫోన్ తయారీదారు ప్రకటించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
పోకో M3 స్మార్ట్‌ఫోన్ కు సంబందించిన స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ వివరాలను అధికారికంగా కంపెనీ ఇంకా ధృవీకరించలేదు కాని ఆన్ లైన్ లో కొన్ని పుకార్ల వివరాలను వెల్లడించాయి. రాబోయే పోకో కొత్త ఫోన్ రెడ్‌మి నోట్ 10 కి చాలా దగ్గర పోలికాను కలిగి ఉంటుందని తెలుపుతున్నారు. షియోమి సంస్థ కూడా ఇంకా రెడ్‌మినోట్ 10 ఫోన్ గురించి చాలా వివరాలను వెల్లడించలేదు. అయితే డిసెంబర్ నెలలో ఫోన్ అధికారికంగా విడుదల అవ్వవచ్చు అని పుకార్లు సూచిస్తున్నాయి. పోకో M2 మరియు పోకో M2 ప్రో వరుసగా రెడ్‌మి 9 మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క రీబ్రాండెడ్ వెర్షన్లుగా విడుదల అయినట్లు అందరికి తెలిసిన విషయమే.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ ఫీచర్స్
పోకో M3 స్మార్ట్‌ఫోన్ దాని మునుపటి పోకో M2 ఫోన్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ గా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది 6.53 అంగుళాల FHD+ స్క్రీన్ డిస్ప్లే, మీడియాటెక్ G80 ప్రాసెసర్, 6GB ర్యామ్, 5000mAh బ్యాటరీ, మరియు 13MP AI క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లను కలిగిన పోకో M2 కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ ధరల రేంజ్ వివరాలు
పోకో M సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇప్పటి వరకు రూ.15,000 ధర లోపు మాత్రమే విడుదల అయ్యాయి. రూ.15 వేల ధర లోపు అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఎంపికగా ఉండనున్నది. రాబోయే పోకో M3 ఫోన్ యొక్క ధర ఇండియాలో రూ.15 వేల కన్నా తక్కువ ధరలోనే ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో పోకో M2 యొక్క 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 కాగా, 128GB స్టోరేజ్ వెర్షన్ యొక్క ధర రూ.12,999. ఈ రెండు వెర్షన్లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

పోకో M3 vs రెడ్‌మి నోట్ 9 సిరీస్ vs రియల్‌మి C సిరీస్ vs శామ్‌సంగ్ M సిరీస్
పోకో M3 ను ఇండియాలో లాంచ్ చేయడం గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఈ సంస్థ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లు రియల్‌మి C సిరీస్, రెడ్‌మి నోట్ 9 సిరీస్, మరియు శామ్‌సంగ్ M సిరీస్ ఫోన్లకు పోటీగా విడుదల కానున్నాయి. సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల సిరీస్లలో అందరి కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications