Poco M3 Pro 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!!! 5G ఫోన్ రూ.15000 లోపే...

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్ గా ఉన్న పోకో నేడు ఇండియాలో వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేశారు. పోకో M3 కి అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న ఈ ఫోన్ రెండు ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో మరియు మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. 5G సపోర్ట్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ డిజైన్‌ వంటి ఫీచర్లతో లభించే పోకో M3 ప్రో 5G గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

పోకో M3 ప్రో 5G ధరలు

పోకో M3 ప్రో 5G ధరలు

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.13,999 ఉండగా, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.15,999. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు పోకో ఎల్లో అనే మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.

 

ఈ నెల June లో లాంచ్ కాబోతోన్న కొత్త ఫోన్లు ఇవే ! లిస్ట్ చూడండి.ఈ నెల June లో లాంచ్ కాబోతోన్న కొత్త ఫోన్లు ఇవే ! లిస్ట్ చూడండి.

పోకో M3 ప్రో 5G సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్
 

పోకో M3 ప్రో 5G సేల్స్ డిస్కౌంట్ ఆఫర్స్

పోకో M3 ప్రో 5G ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు జూన్ 14 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నాయి. అయితే మొదటి అమ్మకంలో కంపెనీ రెండు మోడళ్ల మీద రూ.500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో భాగంగా 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ను రూ.13,499 తగ్గింపుతో మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ను రూ.15,499 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది.

 

6,000mAh బ్యాటరీ ఫీచర్లతో రియల్‌మి C25s కొత్త ఫోన్ లాంచ్!! ధర కూడా తక్కువే...6,000mAh బ్యాటరీ ఫీచర్లతో రియల్‌మి C25s కొత్త ఫోన్ లాంచ్!! ధర కూడా తక్కువే...

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12 తో రన్ అవుతుంది. 6.5-అంగుళాల ఫుల్- HD+ పంచ్-హోల్ డిస్ప్లేను 90HZ రిఫ్రెష్ రేట్, డైనమిక్ స్విచ్ ఫీచర్, 91 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC తో రన్ అవుతూ 6GB వరకు ర్యామ్ మరియు 128GB వరకు యుఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ మరియు మాలి-G57 GPUతో జత చేయబడి ఉంటుంది.

 

 

ఆన్‌లైన్ క్లాసుల కోసం రూ.30,000 లోపు ధరలో లభించే ల్యాప్‌టాప్ & టాబ్లెట్‌లు ఇవే ...ఆన్‌లైన్ క్లాసుల కోసం రూ.30,000 లోపు ధరలో లభించే ల్యాప్‌టాప్ & టాబ్లెట్‌లు ఇవే ...

పోకో M3 ప్రో 5G

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెంట్రల్ పంచ్-హోల్ కటౌట్‌లో కలిగి ఉంది.

పోకో M3 ప్రో 5G కనెక్టివిటీ

పోకో M3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ స్లాట్లు, 5G, NFC, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ V5.1, GPS, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ వంటివి కలిగి ఉన్నాయి. అలాగే ఆన్‌బోర్డ్ సెన్సార్లలో సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్ మరియు IR బ్లాస్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటితో పాటు AI-ఫేస్ అన్‌లాక్‌, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కలిగి ఉన్నాయి. అలాగే ఇవి 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఒకసారి ఛార్జీతో స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల వరకు ఉపయోగంలో ఉంటుందని పోకో పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Poco M3 Pro 5G Smartphone Released in India: Price, Specs, Sale Date, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X