పోకో M3 స్మార్ట్‌ఫోన్ ధరల భారీగా పెరిగాయి!! కొత్త ధరలు ఇవే...

|

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ప్రస్తుతం సరసమైన విభాగంలో లభించే ఫోన్ లో పోకో M3 ఒకటి. పోకో ఫోన్ లలో ముఖ్యంగా ఎల్లో కలర్‌ విభాగంలో ఎక్కువగా ఆకర్షించే స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది రెడ్‌మి 9 ప్రైమ్ మరియు అనేక రియల్‌మి ఫోన్‌లకు సమానమైన ధరను కలిగి ఉంది. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడానికి మీరు మీ మనస్సును ఏర్పరచుకుంటే కనుక మీ కోసం కొన్ని విచారకరమైన విషయాలు ఉన్నాయి. పోకో సంస్థ ఈ ఫోన్‌ యొక్క ధర మీద రూ.500 పెంచింది. దీని గురించి మరిన్ని సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ కొత్త ధరల వివరాలు

పోకో M3 స్మార్ట్‌ఫోన్ కొత్త ధరల వివరాలు

పోకో M3 స్మార్ట్‌ఫోన్ యొక్క రెండు స్టోరేజ్ వేరియంట్ల ధర మీద రూ.500 వరకు పెరుగుదలను అందుకున్నది. ఇందులో 6GB ర్యామ్, 64GB స్టోరేజ్ వెర్షన్‌ ను ఇప్పుడు రూ.11,499 ధర వద్ద మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌ను ఇప్పుడు రూ.12,499 ధర వద్ద పొందవచ్చు. అయితే 4GB ర్యామ్‌తో కూడిన బేస్ వెర్షన్ ధరల్లో ఎటువంటి మార్పును పొందలేదు. పోకో ధరల పెరుగుదల వెనుక గల కారణాన్ని సంస్థ వెల్లడించలేదు. ఈ కొత్త ధరలు ఇప్పటికే ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో వర్తిస్తున్నాయి.

Vi టెల్కో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల మీద రూ.40 డిస్కౌంట్ ఆఫర్!! మిస్ చేసుకోకండి...Vi టెల్కో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల మీద రూ.40 డిస్కౌంట్ ఆఫర్!! మిస్ చేసుకోకండి...

పోకో M3 ఇప్పుడు ఖరీదైనది

పోకో M3 ఇప్పుడు ఖరీదైనది

షియోమి ఆధారిత బ్రాండ్‌లలో సరసమైన విభాగంలోని ఫోన్ల ధరల పెరుగుదల కొత్తది కాదు. అంతకుముందు రెడ్‌మి నోట్ 10 రెండు స్టోరేజ్ వేరియంట్లలో ధరల పెరుగుదలను చూసింది. అయితే రెడ్‌మి నోట్ 10 ప్రో 128GB వేరియంట్‌కు ధరల పెరుగుదలను చూసింది. ఈ ధరల పెరుగుదలలో ఎక్కువ భాగం లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

అంతరిక్షంలోకి ఉచితంగా వెళ్లే అవకాశం!! ఇందుకోసం ఇలా చేయండి..అంతరిక్షంలోకి ఉచితంగా వెళ్లే అవకాశం!! ఇందుకోసం ఇలా చేయండి..

పోకో M3 స్మార్ట్‌ఫోన్ MIUI 12 స్పెసిఫికేషన్స్

పోకో M3 స్మార్ట్‌ఫోన్ MIUI 12 స్పెసిఫికేషన్స్

పోకో M3 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లోని MIUI 12 తో రన్ అవుతుంది. 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేని 1,080x2,340 పిక్సెల్స్, 19.5: 9 కారక నిష్పత్తి మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC తో రన్ అవుతూ 6GB LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది.

పోకో M3 ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్స్

పోకో M3 ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్స్

పోకో M3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉండగా. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

పోకో M3 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

పోకో M3 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్

పోకో M3 స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఇది 64GB మరియు 128GB (UFS 2.2) ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో వస్తుంది. అలాగే ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటుగా స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Poco M3 Smartphone Two variants Price Hike one More Time: New Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X