బడ్జెట్ ధరలో పోకో M4 5G కొత్త ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో....

|

చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తన యొక్క బ్రాండ్ నుంచి నేడు ఇండియాలో కొత్తగా పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC, UFS 2.2 స్టోరేజ్, 6GB ర్యామ్ మరియు టర్బో ర్యామ్ వంటి అద్భుతమైన ఫీచర్‌లను కలిగి ఉంది. అదనంగా ఇది సున్నితమైన కార్యకలాపాల కోసం 2GB స్టోరేజ్ ను RAMగా తీసుకుంటుంది. పోకో M4 5G కొత్త ఫోన్ యొక్క వెనుక ప్యానెల్‌ "హిప్నోటిక్ స్విర్ల్ డిజైన్" ను కలిగి ఉండి ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ వివరాలు

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ వివరాలు

భారతదేశంలో పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.12,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్‌ మోడల్ రూ.14,999 ధర వద్ద కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు ఎల్లో కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. ఇది మే 5 న మధ్యాహ్నం 12pm IST నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్స్ నిర్వహించనున్నది. ఈ మొదటి సేల్స్ లో SBI కార్డ్ వినియోగదారులు రెండు వేరియంట్‌లపై రూ.2,000 తగ్గింపుతో వరుసగా రూ.10,999 మరియు రూ.12,999 ప్రభావవంతమైన ధరల వద్ద కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి GT నియో 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...రియల్‌మి GT నియో 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 పై మరియు కంపెనీ యొక్క MIUI 13 స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్-HD+ LCD డిస్‌ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో కలిగి ఉంది. అలాగే ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 6GB RAMతో జత చేయబడి ఉంటుంది. పోకో బ్రాండ్ యొక్క ఈ కొత్త ఫోన్ టర్బో ర్యామ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది 2GB స్టోరేజ్ ను సున్నితమైన కార్యకలాపాల కోసం RAMగా ఉపయోగిస్తుంది.

ఫోటోగ్రఫీ

పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్ లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు f/2.4 లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందుభాగంలో f/2.45 లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ని కలిగి ఉండి మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే ఇందులోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది ఏడు 5G బ్యాండ్‌లతో Wi-Fi, మరియు బ్లూటూత్ 5.1 మరియు USB టైప్-C పోర్టులను మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంది. చివరిగా ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Poco M4 5G Smartphone Launched in India With 18W Fast Charging Technology: Price, Specifications, Features, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X