Poco M4 Pro 5G ఫ్లిప్‌కార్ట్ మొదటి సేల్ లో బ్రహ్మాండమైన డిస్కౌంట్ ఆఫర్లు...
షియోమి స్మార్ట్ ఫోన్ యొక్క సబ్-బ్రాండ్ పోకో సంస్థ ఇండియాలో గతవారం పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నేడు భారతీయ మార్కెట్లో మొదటిసారి విక్రయానికి అందుబాటులోకి రానున్నది. మధ్యాహ్నం 12PM నుంచి ఫ్లిప్‌కార్ట్ లో మొదటి సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ద్వారా శక్తిని పొందుతూ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మరియు 6.6-అంగుళాల 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సెటప్, 8GB వరకు RAM వంటి మరిన్ని మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Poco M4 Pro 5G ధరలు & సేల్స్ ఆఫర్లు
గతవారం భారతదేశంలో పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లాలో విడుదల అయింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మోడల్ ధర రూ.16,999 చివరిగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ టాప్-ఎండ్ వేరియంట్ యొక్క ధర రూ.18,999. ఇది కూల్ బ్లూ, పోకో యెల్లో మరియు పవర్ బ్లాక్ వంటి కలర్ లలో లభిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే నేటి అమ్మకంలోని లాంచ్ ఆఫర్‌లలో భాగంగా రూ.1000 వరకు తగ్గింపు ఉంటుంది. అదనంగా SBI కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి.

పోకో M4 ప్రో 5G స్పెసిఫికేషన్స్
పోకో M4 ప్రో 5G కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12.5పై నడుస్తుంది. ఇది కొన్ని వారాల్లో MIUI 13 అప్‌గ్రేడ్‌ని కూడా అందుకోవచ్చని కంపెనీ వాగ్దానం చేసింది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ డాట్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని యొక్క డిస్ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు DCI-P3 వైడ్ కలర్ గామట్‌ని కూడా కలిగి ఉంది. అలాగే ఇది హుడ్ కింద 8GB వరకు LPDDR4X ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 810 SoCని కలిగి ఉంది.

పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా సెటప్‌లో f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాల్ కోసం 5G ముందు భాగంలో f/2.45 లెన్స్‌తో జత చేయబడిన 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

పోకో M4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికొస్తే 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ ను కలిగి ఉంది. అలాగే మైక్రో SD కార్డ్ స్లాట్ మెమొరీని 1TB వరకు విస్తరణకు మద్దతును ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో అమర్చబడి ఉంటుంది. అలాగే ఇది 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications